Shekhar Master : కూతురుతో శేఖర్‌ మాస్టర్ వేసిన డాన్స్ పై కొందరు విమర్శలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shekhar Master : కూతురుతో శేఖర్‌ మాస్టర్ వేసిన డాన్స్ పై కొందరు విమర్శలు

 Authored By prabhas | The Telugu News | Updated on :21 March 2022,8:00 pm

Shekhar Master : హోలీ సందర్భంగా స్టార్ మా టీవీలో ఈ హోలీకి తగ్గేదే అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. యాంకర్ రవి మరియు రష్మి గౌతమ్ షో కి హోస్టింగ్ చేశారు. సుధీర్ ఇంకా పలువురు స్టార్ కమెడియన్ పాల్గొన్నారు. అంతే కాకుండా స్టార్ మా కు చెందిన సీరియల్ ఆర్టిస్టు బుల్లి తెర ప్రముఖులు ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ షో మొత్తం లో రెండు డాన్స్ పర్ఫార్మెన్స్ లో బాగా హైలైట్ అయ్యాయి. అందులో మొదటిది శేఖర్ మాస్టర్ తన కూతురు తో చేసిన డ్యాన్స్ ఒకటి కాగా యాంకర్ రవి తన కూతురు తో చేసిన డ్యాన్స్.

ఈ రెండు డాన్సులు కూడా ప్రేక్షకులకు కన్నుల విందు చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. శేఖర్ మాస్టర్ తన కూతురు తో చేసిన డ్యాన్స్ అద్భుతంగా ఉంది అంటూ ప్రోమో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులు ఎదురు చూడడం మొదలు పెట్టారు. సిద్ధార్థ్ త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా నుండి చంద్రుళ్ళో ఉండే కుందేలు అనే పాట శేఖర్ మాస్టర్ తన కూతురు తో డాన్స్ వేయడం జరిగింది. ఈ విషయంలో 99 శాతం మంది అభినందనలు తెలియజేస్తూ ఉంటే ఒక్క శాతం మంది మాత్రం ట్రోల్స్‌ చేస్తున్నారు.తండ్రీ కూతుళ్లు అలాంటి పాటకు డాన్స్ చేయడమేంటి అంటూ మీడియాలో వారు ట్రోల్స్‌ చేస్తూ తమ సునకానందాన్ని పొందుతున్నారు.

trolls on Shekhar master and his daughter dance in star maa tv show

trolls on Shekhar master and his daughter dance in star maa tv show

ఒక సీనియర్ జర్నలిస్టు తన ఫేస్బుక్ పేజీలో తండ్రి కూతుర్ల డాన్స్ ఏంటో అంటూ విమర్శిస్తూ పోస్టు పెట్టాడు. ఆయన పోస్టు ను చాలా మంది తిప్పి కొట్టగా కొందరు మాత్రం సమర్పించారు. శేఖర్ మాస్టర్ ఎంపిక చేసుకున పాట విషయంలో ఆయన విమర్శలు గుప్పించాడు. ఎక్కువ శాతం మంది వారిద్దరి డాన్స్ చూశారు కానీ ఆయన మాత్రం ఎంపిక చేసుకున్న పాటను చూశాడు. అయినా అదేమీ రొమాంటిక్ సాంగ్ కాదు.. లేదంటే ఒక డ్యూయెట్‌ సాంగ్‌ కాదు. అయినా కూడా ఆయనకు ఎందుకు అలా అనిపించిందో అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. మొత్తానికి శేఖర్ మాస్టర్ మరియు ఆయన కూతురు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది