Prema : ప్రేమ రెండవ పెళ్ళి .. వాస్తవాలు బయటికి వెల్లడి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prema : ప్రేమ రెండవ పెళ్ళి .. వాస్తవాలు బయటికి వెల్లడి..!

 Authored By govind | The Telugu News | Updated on :3 June 2021,5:18 pm

Prema : సీనియర్ హీరోయిన్ ప్రేమ ఇటీవల తన గురించి వస్తున్న వార్తల మీద రియాక్ట్ అయ్యారు. ఈమె రెండవ పెళ్ళి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. పలు కుటుంబ కథా చిత్రాలలో నటించి బాగా పాపులారిటీని తెచ్చుకున్నారు. తెలుగులో ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ రూపొందించిన దేవి చిత్రంలో పోషించిన దేవి పాత్రకి దేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. కమర్షియల్ సినిమాలలో నటించినా కూడా గ్లామర్ రోల్స్ కి చాలా దూరంగా ఉంది.

అందుకే ప్రేమకి ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పేరుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇంత క్రేజ్ ఉన్న ఈమె సినిమాలు కాదనుకొని 2006 సంవత్సరంలో ప్రముఖ బిజినెస్మెన్ జీవన్ అప్పచును ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రేమకు భర్తతో విభేదాలు తలెత్తడంతో కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రేమ రెండో పెళ్లికి సిద్దమయిందని పలు సామాజిక మాధ్యమాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

truth behind prema second marriage

truth behind prema second marriage

Prema : ప్రేమ మళ్ళీ సినిమాలలో నటించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ వార్తలు ఆమె వరకు చేరడంతో తాజాగా స్పందించారు. నా రెండవ పెళ్ళికి సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వాటిని నమ్మవద్దని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇదే కాదు ప్రేమ క్యాన్సర్ తో కూడా పోరాడుతున్నారని ప్రచారం జరిగింది. ఇందులోనూ నిజం లేదని ప్రేమ క్లారిటీ ఇచ్చారు. విడాకులు తీసుకున్న ప్రేమ మళ్ళీ సినిమాలలో నటించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే 2017లో ‘మత్తే బా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. కానీ తెలుగులో మాత్రం ఈమెకి ఆఫర్లు రావడం లేదు. గత ఏడాదిగా తెలుగులో అవకాశాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తెరకెక్కించిన అరవింద సమేతలో నటించబోతున్నారని చెప్పుకున్నారు. కానీ ఆ సినిమాలో ప్రేమకి అవకాశం రాలేదు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Vishnu Priya : భారీ అందాలను ఊపేసిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> రాజమౌళి తల్లి.. మా చిరంజీవి అనడం వెనుక ఇంత క‌థ ఉందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Bigg Boss Divi : వైరల్ పిక్స్.. ప్యాంట్ వేసుకోవడం మరిచిన దివి

ఇది కూడా చ‌ద‌వండి ==> Priyamani : పూల‌పూల సారీలో పిచ్చెక్కిస్తున్న పియ‌మ‌ణి ఫిక్స్ వైర‌ల్‌

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది