Villain Rami Reddy : చివరి రోజుల్లో విలన్ రామిరెడ్డి ఎయిడ్స్ వచ్చి చనిపోయారా?
Villain Rami Reddy : విలన్ రామిరెడ్డి.. 90ల్లో ఈయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకే ఒక్క సినిమాతో విలనిజం అంటే ఇలా చేయాలని అని ఆయన్ను ఎందరో ఆదర్శంగా తీసుకున్నారు. ఒకే సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ లో విలనిజానికి కిక్కెక్కిచ్చిన నటుడు. అంకుశం సినిమాలో నీలకంఠం పాత్రలో నమస్తే బాయ్.. నేను మామూలుగా ఎవ్వరికీ నమస్తే పెట్టను కానీ.. పెడుతున్నా అంటూ అంకుశం సినిమాలో అసలైన విలనిజాన్ని ప్రదర్శించారు. అయితే.. ఆయన నటుడు కావాలని ఏనాడూ అనుకోలేదు. అతడి జీవితం సాఫీగా సాగుతుంటే దర్శకుడు కోడి రామకృష్ణ రామిరెడ్డికి మంచి లైఫ్ ఇచ్చారు. బాలీవుడ్ లో కొత్త తరం విలన్ ను చూపించిన నటుడు కేవలం రామిరెడ్డి మాత్రమే.
ఇక.. రామిరెడ్డి గురించి చెప్పాలంటే.. ఆయనది చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం. 1959 లో జన్మించిన ఆయన.. చిత్తూరులోనే చదువు పూర్తిచేశారు. జర్నలిస్టు కావాలనే సంకల్పంతో హైదరాబాద్ కు వచ్చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజే చేశారు. తనకు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండటంతో లోకల్ యాస వచ్చేసింది. చిత్తూరు యాసను మరిచిపోయి ఆయన తెలంగాణ యాసలోనే మాట్లాడేవారు. జర్నలిజం డిగ్రీ పూర్తయ్యాక ఓ తెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా తన ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత పేరున్న పత్రికల్లో పని చేయాలని అనుకునేవారు రామిరెడ్డి. హైదరాబాద్ లోని స్నేహితుల వల్ల హిందీ కూడా బాగా నేర్చుకున్నారు రామిరెడ్డి.
Villain Rami Reddy : అంకుశం సినిమాలో విలన్ గా సినిమాల్లోకి ఎంట్రీ
అప్పట్లో ఆయన సినిమా వార్తలు కూడా రాసేవారు. కొన్ని పత్రికలకు ప్రత్యేకంగా సినిమా వార్తలు రాస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేసేవారు. ఓ రోజు రామిరెడ్డి.. కోడిరామకృష్ణకు కాల్ చేసి మీ ఇంటర్వ్యూ కావాలి సార్ అని అడుగుతాడు రామారెడ్డి. దీంతో ఉదయం 11 గంటలకు రావాలని కోడి రామకృష్ణ చెబుతాడు. ఆ సమయంలోనే అంకుశం స్క్రిప్ట్ ఓకే అయింది. విలన్ కోసం వెతుకుతున్నారు. కొత్తగా నటించే వాళ్లు కావాలని వెతుకుతున్నారు. అదే సమయంలో కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ కోసం లాల్చీ వేసుకొని బొట్టు పెట్టుకొని పాన్ నములుతూ ఓ డొక్కు స్కూటర్ మీద చిన్న రైటింగ్ ప్యాడ్ పట్టుకొని దిగాడు రామిరెడ్డి. ఆరు అడుగుల ఆజానుబాహుడు.. తన దగ్గరికి వస్తున్న రామిరెడ్డిని చూసి కోడి రామకృష్ణ షాక్ అయ్యారు.
తనకు విలన్ దొరికేశాడు.. నిఖార్సయిన హైదరాబాదీ విలన్ దొరికాడు అని అనుకుంటాడు కోడి రామకృష్ణ. మంచి కాఫీ ఇప్పించారు కోడి. కాసేపు కూర్చోబెట్టి మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంటర్వ్యూ ఇస్తాను కానీ సినిమాల్లో నటిస్తావా అంటే నాకు యాక్టింగ్ రాదు సార్ అంటాడు రామిరెడ్డి. యాక్టింగ్ సంగతి పక్కన పెట్టు.. నీకు నటించడం ఓకేనా చెప్పు అంటాడు కోడి రామకృష్ణ. దీంతో ఓకే సార్ చేసేస్తా అంటాడు రామిరెడ్డి. హీరో రాజశేఖర్, శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాత కావడం.. పెద్ద బ్యానర్ మూవీ కావడం, మెయిన్ విలన్ కావడంతో రామిరెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
వెంటనే శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గరికి కోడి రామకృష్ణ.. రామిరెడ్డిని తీసుకెళ్లాడు. అలా.. అంకుశం సినిమాలో నీలకంఠంగా కనిపించాడు. హీరోకు దమ్కీ ఇచ్చే పాత్రలో రామిరెడ్డి కుమ్మేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వరుస పెట్టాయి. హిందీలో కూడా ఆయనకు అవకాశాలు చాలా వచ్చాయి. ప్రతిబంద్ సినిమాలో విలన్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో హిందీలో ప్రతి సినిమాలో స్టార్ హీరోలు రామిరెడ్డినే విలన్ గా కావాలనేవారు. ఆ తర్వాత తెలుగులోనూ వరుసగా విలన్ గా అవకాశాలు వచ్చాయి.
దాదాపు 3 ఏళ్ల పాటు రామిరెడ్డి డేట్స్ ఖాళీగా ఉండేవి కావు. భారీ రెమ్యునరేషన్ ఇస్తామని హిందీ నుంచి దర్శకనిర్మాతలు బతిమిలాడేవారు. అక్షయ్ కుమార్ సినిమాలోనూ విలన్ గా నటించాడు. జర్నలిస్టుగా పనిచేసిన ఆయన విలువలు పాటించారు. అమ్రీష్ పూరీ తర్వాత ఆ రేంజ్ కొత్త విలన్ గా అదరగొట్టేశాడు రామిరెడ్డి. బాలీవుడ్ లో రామిరెడ్డి తప్ప ఏ విలన్ వద్దని కుర్ర హీరోలు దర్శకులను బతిమిలాడుకునేవారు. అలా.. తెలుగు, హిందీ సినిమాలు విపరీతంగా చేశాడు రామిరెడ్డి.
2006 వరకు సూపర్ బిజీ అయ్యాడు. తెలుగులో మనం రామిరెడ్డిని మరిచిపోయాం కానీ.. విలన్ అంటే అంజాద్ ఖాన్, అమ్రీష్ పూరీ, ఆ తర్వాత రామిరెడ్డి కూడా విలన్ గా గుర్తింపు పొందాడు. 1990 నుంచి ఆయన చనిపోయే వరకు 2010 వరకు 250 సినిమాలకు పైగా నటించారు. తెలుగు, హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నా తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించాడు రామిరెడ్డి.
రామిరెడ్డి అప్పట్లోనే ఎక్కువగా మద్యం తీసుకునే వారు. కొన్ని సార్లు వారం రోజుల పాటు ఫైట్ సీన్స్ చేసే వారు. ఆ క్రమంలోనే ఆయనకు లివర్ సంబంధిత జబ్బు వెంటాడింది. ట్రీట్ మెంట్ తీసుకున్నా కూడా ఆయన ఒక్కసారిగా గుర్తుపట్టలేనంత బలహీనంగా మారిపోయారు. ఆయనకు లుక్కే అందం. అది కాస్త పోవడంతో సినిమా ఛాన్సులు పోయారు. అయినా కూడా 20 ఏళ్లు తీరిక లేకుండా నటించానని.. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాలని అనుకున్నా ఆయనకు క్యాన్సర్ సోకడంతో ఆయన 52 ఏళ్లకే ఆయన కన్ను మూశాడు. రామిరెడ్డికి ఎయిడ్స్ సోకిందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి కానీ.. అది తప్పు అని తేలింది. ఆయనకు లివర్ తో పాటు క్యాన్సర్ రావడంతో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటూనే చనిపోయారు.