టక్ జగదీష్ తో నాని మళ్ళీ ప్రయేగం చేస్తున్నాడు.. బెడిసికొడితే అంతే ..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

టక్ జగదీష్ తో నాని మళ్ళీ ప్రయేగం చేస్తున్నాడు.. బెడిసికొడితే అంతే ..?

టక్ జగదీష్ .. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా. గతంలో నాని కి నిన్నుకోరి వంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ తెరకెక్కుతోంది. నాని నటిస్తున్న 26వ సినిమాగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ […]

 Authored By govind | The Telugu News | Updated on :25 December 2020,2:31 pm

టక్ జగదీష్ .. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా. గతంలో నాని కి నిన్నుకోరి వంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ తెరకెక్కుతోంది. నాని నటిస్తున్న 26వ సినిమాగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

Nani and Shiva Nirvana come together again? | Telugu Movie News - Times of India

ఈ పోస్టర్ నాని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాని ఈ పోస్టర్ చూస్తుంటే మళ్ళీ నాని మరోసారి ప్రయోగం చేస్తున్నాడని టాక్ మొదలైంది. అంతేకాదు నిజంగా టక్ జగదీష్ తో నాని చేసేది ప్రయోగమే అయితే మాత్రం ఎలా ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారట. నాని కి గత కొంతకాలంగా ప్రయోగాలు వికటిస్తున్నాయి. నాని గత చిత్రం వి కూడా ఒక ప్రయోగమే. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సస్ ని సాధించలేదు. నాని కంటే వి సినిమా సుధీర్ బాబు కే ఎక్కువగా కలిసి వచ్చింది. మళ్ళీ అదే ఇప్పుడు టక్ జగదీష్ సినిమాతో రిపీటవుందా అని చెప్పుకుంటున్నారట.

Tuck Jagadish FL: Stylish Nani's Violent Avatar | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

అయితే ఇప్పటి వరకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్నుకోరి, మజిలీ సినిమాలు ఊహించని రేంజ్ లో సక్సస్ ని సాధించాయి. కాబట్టి టక్ జగదీష్ గ్యారెంటీగా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ ని సాధిస్తుందని ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. మొత్తానికి నాని టక్ జగదీష్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకొని ఫుల్ ఫాం లోకి వచ్చేస్తాడని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు ఇటీవలే శ్యాం సింగ్ రాయ్ అన్న సినిమా కూడా సెట్స్ మీదకి వచ్చింది. వచ్చే ఏడాది టక్ జగదీష్ తో పాటు శ్యాం సింగ్ రాయ్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు నాని.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది