వకీల్ సాబ్ నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టీజర్ కోసం టైం ఫిక్స్ చేశారు పవన్ కళ్యాణ్. మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేశాడు. అయితే దసరా పండుగ సందర్భంగా వకీల్ సాబ్ నుంచి టీజర్ ని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ మేకర్స్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ దీపావళి పండుగ కి తర్వాత క్రిస్మస్ కి వకీల్ సాబ్ నుంచి టీజర్ వస్తుందని ఆతృతగా ఎదురు చూశారు. కాని ఎదురు చూపే తప్ప అనుకున్న టీజర్ మాత్రం రాలేదు.
దాంతో ఫ్యాన్స్ కి విసుగొచ్చి ఇక వకీల్ సాబ్ టీజర్ గురించి ఆశలు వదిలేసుకున్నారు. కాని రీసెంట్ గా వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ అవడం తో మళ్ళీ ఫ్యాన్స్ టీజర్ గాని లేదా మరేదైనా సర్‌ప్రైజ్ వస్తుందేమో అని ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా వకీల్ సాబ్ న్యూ ఇయర్ సందర్భంగా అర్థ రాత్రి 12 గంటలకి వస్తున్నట్టు వెల్లడించారు.
ఇలా సర్‌ప్రైజ్ ని అనౌన్స్ చేసిన కొన్ని నిముషాలలోనే సోషల్ మీడియా మొత్తం షేకయి పోతోంది. నిముషాలు.. గంటలు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు.. ప్రేక్షకులు. మొత్తానికి వకీల్ సాబ్ నుంచి వచ్చేది ఖచ్చితంగా టీజర్ ఆ లేక ఇంకేదైనానా అన్నది పక్కా క్లారిటీ లేదు గాని వచ్చేది మాత్రం పక్కా అని తేలిపోయింది. చూడాలి మరి వకీల్ సాబ్ ఏం సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడో. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.