Jr NTR : ఎన్టీఆర్ ను మళ్లీ కలిసిన ఉప్పెన దర్శకుడు.. మేం చెప్పింది నిజం కాబోతుంది!
Jr NTR : ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సక్సెస్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు అనే ఆశ తో అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆచార్య ప్రభావమో లేదా మరేంటో కాని ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభం కాలేదు. ఎప్పటికి ప్రారంభం అయ్యేది కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ 30 ప్రకటన వచ్చి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో రెడీ అవ్వని స్క్రిప్ట్ ను కొరటాల శివ ఇప్పుడు రెడీ చేస్తాడా అంటే డౌటే అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో గుప్పుమంటున్నాయి.
ఇదే సమయంలో కొరటాల శివ కాస్త హోల్డ్ లో పెట్టి ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుతో సినిమాను వెంటనే చేసేందుకు ఎన్టీఆర్ చర్చిస్తున్నాడు అంటూ ఇటీవల మేము ఒక కథనంలో పేర్కొన్నాం. మాకు అందిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 యొక్క దర్శకుడు కొరటాల కాకుండా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నాము. మేము అన్నట్లుగానే తాజాగా ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబుల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు ఫైనల్ వర్షన్ స్క్రిప్ట్ ను దర్శకుడు బుచ్చి బాబు వినిపించాడని తెలుస్తోంది.
కొరటాల ఇప్పటికిప్పుడు సినిమా చేసినా కూడా మార్కెట్ ఆశించిన స్థాయిలో జరిగే అవకాశం లేదు. అందుకే ఎన్టీఆర్ 30 కి బుచ్చి బాబు తో దర్శకత్వం చేయిస్తే.. ఎన్టీఆర్ 31 లేదా ఆ తర్వాత కొరటాల శివ తో ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు ఈ విషయమై ఒక క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు. నిర్మాత కళ్యాణ్ రామ్ ఇటీవల ఎన్టీఆర్ 30 గురించి మాట్లాడి కాస్త సమయం పడుతుందని అన్నాడు. ఇప్పుడు దర్శకుడు కూడా మారే అవకాశం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.