Vadinamma 18 Oct Today Episode : డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన భరత్.. వదిన వల్లే తను ఈ స్థాయికి ఎదిగానని చెప్పిన భరత్.. షాక్ అయిన సిరి
Vadinamma 18 Oct Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 18 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవాళ్టి పేపర్ ఇంకా రాలేదా? అని సిరి కొట్టుకు వస్తుంది. ఇంతలో చాయ్ తాగుదామని భరత్ అంటాడు. ఇంకా పేపర్ రావట్లేదేంటని టెన్షన్ పడుతుంటారు సిరి, భరత్. మరోవైపు ఇంట్లో సీత అన్నీ సర్దుతుంటుంది. భరత్.. భరత్ అని రఘురామ్ అడుగుతాడు. సామాన్లు తెమ్మని చెప్పాను.. అని అంటాడు రఘురామ్. బావా టెన్షన్ పడకు. సిరి, భరత్ ఇద్దరూ బయటికి వెళ్లారు.. వచ్చాక చెబుతారులే.. అంటుంది సీత.

Vadinamma 18 october 2021 full episode
పేపర్ వ్యక్తి సైకిల్ మీద వస్తుంటాడు. పేపర్ రాగానే తీసుకొని వెంటనే తన హాల్ టికెట్ నెంబర్ చెక్ చేస్తారు. కానీ.. తన నెంబర్ ఉండదు. దీంతో భరత్, సిరి షాక్ అవుతారు. తన నెంబర్ కనిపించకపోవడంతో నేను ఫెయిల్ అయ్యాను అని అనుకుంటాడు. బావా నెంబర్ లేదు.. అనగానే భరత్ తెగ బాధపడిపోతాడు. నాకు చదువు అచ్చిరాదని చెప్పాను. కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు చూశావా? నేను చదువురాని మొద్దును అయిపోయాను.. అని సిరితో చెబుతాడు భరత్.
కట్ చేస్తే.. ఇంటి దగ్గరికి న్యూస్ మీడియా వాళ్లు వస్తారు. ఇక్కడ భరత్ ఎవరండి అని అడుగుతారు. భరత్ ఎవరు? అని అడుగుతారు. వాడితో ఏం పని. ఏం చేశాడు వాడు.. అని అడుగుతారు. దీంతో మా తమ్ముడేనండి.. అని రఘురామ్ చెబుతాడు. మీరు విషయం ఏంటో చెప్పండి నేను మాట్లాడుతాను అంటాడు రఘురామ్. మేము అతడితోనే డైరెక్ట్ గా మాట్లాడుతాం అంటారు మీడియా వాళ్లు. ఇంతలో భరత్, సిరి బాధపడుతూ వస్తారు.
Vadinamma 18 Oct Today Episode : డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చావని భరత్ కు చెప్పిన మీడియా వాళ్లు
డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడంటే నమ్మేలా ఉందా? అని అంటారు వాళ్లు. మీరు నైట్ కాలేజీలో చదివి ఇంటర్ పరీక్షలు రాశారు కదా అని అడుగుతారు. ఈ హాల్ టికెట్ నెంబర్ మీదే కదా అని అడుగుతారు. మీరు ఇంటర్ లో డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంకర్ గా నిలిచారు.. అని మీడియా వాళ్లు చెబుతారు. దీంతో అందరూ షాక్ అవుతారు. మేము రిపోర్టర్స్. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం. మీ ఫ్యామిలీ వాళ్లను కూడా పిలవండి.. అని అడుగుతారు.

Vadinamma 18 october 2021 full episode
అందరినీ లోపలికి పిలిచి అసలు విషయం చెబుతారు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇంటర్వ్యూలో పాల్గొంటారు. మొత్తానికి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. నేను కాలేజీ పాస్ అయ్యానంటే దానికి కారణం మా వదినమ్మే.. అంటూ తన వదినను పొగడ్తల్లో ముంచెత్తుతాడు భరత్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.