Samantha : సమంతకు సపోర్టుగా వనితా విజయ్ కుమార్.. అలా చేయాలంట
Samantha : సామ్ చై విడిపోతున్నారని తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాధపడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా చాలా మంది సమంతను ఆడిపోసుకుంటూ వచ్చారు. సామ్ వల్లే అక్కినేని కుటుంబం పరువుపోయిందని కామెంట్లు చేస్తూ వచ్చారు. జులై నెలలో సామ్ చై విడాకుల గురించి రూమర్లు వెల్లువెత్తగా.. అక్టోబర్ 2న అధికారికంగా క్లారిటీ ఇచ్చారు సామ్ చై దంపతులు. ఏడేళ్లుగా అన్యోన్యంగా ఉంటున్న క్యూటెస్ట్ కపుల్ ఒక్కసారిగా విడిపోవడానికి కారణాలు ఎంటో ఇప్పటికీ బహిర్గతం కాలేదు.
అభిమానులు, నెటిజన్లు మాత్రం విడాకులకు సామ్ ప్రవర్తనే కారణమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సామ్ వ్యవహారశైలి సరిగా లేదని.. పలు ఇంటర్వ్యూల్లో చైతు కంటే తనకు కుక్కలే ఎక్కువ అని చెప్పడంతో నాగ్ అభిమానులు, కుటుంబ సభ్యులు ఒకింత నిరాశకు గురైనట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.ఇకపోతే తనపై వస్తున్న ప్రచారాలను సమంత తీవ్రంగా ఖండించింది. అవన్నీ అవాస్తవమని.. తాను ఎప్పుడూ అలా చేయలేదని బాధను వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే.
Samantha: బేబ్ అలా చేయు అంటున్న వనిత..
సోషల్ మీడియాలో తనపై వస్తోన్న పుకార్లు అన్ని నిజం కావని.. తనకు ఎవరితో ఎఫైర్స్ లేవని చెప్పుకొచ్చింది. తాను అవకాశవాదిని అని.. అబార్షన్ చేయించుకున్నానని ప్రచారం చేస్తున్నారు. తాను ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదని స్పష్టంచేసింది సామ్. ఈ సొసైటీ మగవారు మిస్టేక్స్ చేస్తే ఒకలా.. ఆడవారు చేస్తే ఒకలా రియాక్ట్ అవుతుందని.. అలాంటప్పుడు ఇక్కడ నైతిక విలువలు ఉన్నాట్టా ? అని సామ్ పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో సామ్ ఒంటరి పోరును చూశాక ఆమెకు ఇండస్ట్రీలో క్రమంగా మద్దతు పెరుగుతోంది. నిన్న సామ్‌కు సపోర్టుగా రకుల్ ప్రీత్ సింగ్ నిలవగా.. నేడు వనితా విజయ్ కుమార్ సైతం తన మద్దతు ప్రకటించింది. ‘బేబ్.. విలువలతో కూడిన సమాజం అనేది లేదు.. ఈ లైఫ్ నీది.. మన ఫోటోలను మాత్రమే ఈ సొసైటీ చూస్తుంది.. కానీ వీడియో వేరేలా ఉంటుందనేది తెలీదు. లైఫ్ చాలా విలువైనది. ఎక్కువగా బాధపడకు. ప్రతీ ఒక్కటి ఏదో ఒక కారణం చేతనే జరుగుతుంది. ఇకపై ముందుకు వెళ్తూనే ఉండూ.. నీకు ఇంకా బలం చేకూరాలంటూ.. ట్వీట్ చేసింది.