Varun tej – Lavanya Tripathi : వరుణ్ – లావణ్య పెళ్లికి కొత్త సమస్య .. షాక్ లో నాగబాబు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varun tej – Lavanya Tripathi : వరుణ్ – లావణ్య పెళ్లికి కొత్త సమస్య .. షాక్ లో నాగబాబు..

 Authored By aruna | The Telugu News | Updated on :1 September 2023,9:00 pm

Varun tej – Lavanya Tripathi : ఇటీవల సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి మెగా ఫ్యామిలీ హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది. అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లా ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరు గ్రాండ్గా వివాహం చేసుకోబోతున్నారు. ఇటలీలో మూడు రోజులు వెడ్డింగ్ డెస్టినేషన్ ని ప్లాన్ చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఎవరు హాజరు కావడం లేదు.

కేవలం వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల పెళ్లి గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. రీసెంట్గా వరుణ్ తేజ్ నటించిన సినిమా ‘ గాండీవదారి అర్జున ‘ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెగటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇది వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా అని చెప్పవచ్చు. అయితే దీనంతటికీ కారణం లావణ్య త్రిపాఠి అని అంటున్నారు. లావణ్య త్రిపాఠి వరుణ్ లైఫ్ లోకి రావడంతో ఆయనకు కలిసి రావడం లేదని, లావణ్య త్రిపాఠి ఐరన్ లెగ్ అని అంటున్నారు.

Varun tej and Lavanya Tripathi marriage news

Varun tej – Lavanya Tripathi : వరుణ్ – లావణ్య పెళ్లికి కొత్త సమస్య .. షాక్ లో నాగబాబు..

ఈ క్రమంలోనే లావణ్యను వరుణ్ దూరం పెడితే మంచిది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. లావణ్య మెగా ఫ్యామిలీకి కోడలు అయితే అస్సలు అచ్చు రాదని, గతంలో రేణు దేశాయ్ సైతం ఇలాంటి బ్యాడ్ సెంటిమెంటును తీసుకొచ్చిందని, ఇప్పుడు వరుణ్ తేజ్ లైఫ్ లోను అలాగే జరగబోతుందని ప్రచారం జరుగుతుంది. దీంతో మెగా ఇంట పెళ్లి సందడి షురూ అయ్యేలోపు కొత్త లొల్లి స్టార్ట్ అయిందని అంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీ ఈ కామెంట్స్ ని పట్టించుకోకుండా పెళ్లి పనులను చేసుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది