Varun Tej : సూపర్ పిల్లని పట్టాడు గా .. వరుణ్ తేజ్ కి కాబోయే భార్య ఈ అమ్మాయే..!!
Varun Tej : ఇటీవల సినీ ఇండస్ట్రీలో పెళ్లి వార్తలు బాగా వస్తున్నాయి. కొన్ని రోజుల ముందే హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక త్వరలోనే మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కపోతున్నాడు. ముకుంద సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ ‘ ఫిదా ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి ‘ ఎఫ్ 3 ‘ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
అయితే త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు ఈ విషయం గురించి చెప్పారు. అంతేకాకుండా ఈ విషయాన్ని వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. ఆ అమ్మాయి ఎవరు అనేది ఆ వివరాలను నేను ఇప్పుడు చెప్పలేను వరుణ్ తేజ్ స్వయంగా అధికారికంగా ప్రకటిస్తాడని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ చిన్న కూతురిని వివాహం చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలపై నాగబాబు స్పందించలేదు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ గాండీవధారి అర్జున ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఎస్వీసీసీ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీకి బాపినీడు బీవీఎస్ఎన్ ప్రసాద్లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో నాగబాబు పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి మాట్లాడారు. కళ్యాణ్ ఆస్తులు కన్నా అప్పులే ఎక్కువ ఉన్నాయని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం ప్రజల కోసం హెల్ప్ చేస్తాడని నాగబాబు అన్నారు.