Venkatesh – Varun Tej : వెంకటేశ్, వరుణ్ తేజ్‌పై పరుచూరి ఫైర్.. అదో స్టుప్పిడ్ సినిమా అంటూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venkatesh –  Varun Tej : వెంకటేశ్, వరుణ్ తేజ్‌పై పరుచూరి ఫైర్.. అదో స్టుప్పిడ్ సినిమా అంటూ..!

 Authored By aruna | The Telugu News | Updated on :14 August 2022,9:40 pm

Venkatesh –  Varun Tej : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడితో సినిమాలు చేయాలని కోరుకుంటారు. ఇలా చేయడం వలన తమ కెరీర్ కూడా సజావుగా సాగుతుందని, హిట్స్ వస్తాయని భావిస్తుంటారు. కానీ సక్సెస్ అనేది దర్శకుడు మేకింగ్‌తో పాటే కంటెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుందని తెలియక చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు.ఈ క్రమంలోనే వెంకటేశ్, వరుణ్ తేజ్ కూడా తొందపాటులో ఎఫ్-3 సినిమా చేశారని ప్రముఖ సీనియర్ రైటర్ పరుచూరి మండిపడ్డారు.అసలు ఎఫ్ 3 సినిమా స్టుప్పిడ్ అని చెప్పుకొచ్చారు. సీనియర్ హీరో వెంకటేశ్ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారని ప్రశ్నించారు. అయితే, ఇటీవల వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.ఈ సినిమాతో మరోసారి వెంకటేష్, వరుణ్ తేజ్ తమ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సినిమాపై చాలా మంది విమర్శలు కూడా చేశారు.

చాలా మంది ఎఫ్ 3 సినిమా డిజాస్టర్ అవుతుందని చెప్పారు. కానీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. సినిమాలో ఏం లాజిక్ లేదని చాలామంది సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేశారు. హాయిగా నవ్వుకునే సినిమా లో ఇలా లాజిక్స్ వెతుక్కోవడం ఏంటి అని సినిమా చూసిన చాలామంది దర్శకుడు అనిల్ రావిపూడిని విమర్శించారు. అయితే, తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విమర్శలు చేశారు.ఈ సినిమాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పరుచూరి.వెంకటేష్ ఏజ్ ఏంటో అందరికీ తెలుసు.అలాంటిది వెంకటేష్ మురళి శర్మ కొడుకుగా నటించడం పెద్ద పొరపాటు అని ఆయన అన్నారు. సాధారణంగా అయితే వెంకటేష్ ఇలాంటి స్టుపిడ్ కథలను అస్సలు ఓకే చేయరు.

Paruchuri fire on venkatesh varun tej

Paruchuri fire on venkatesh varun tej

కానీ ఈ సినిమాకి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. అలాగే ఈ సినిమాలో సెకండాఫ్ లో మురళి శర్మ ని వరుణ్ తేజ్,వెంకటేష్ లు ఇద్దరు కొడుకులుగా నమ్మించే ప్రయత్నం చేయడం, అంతేకాకుండా తమన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలాగా చూపించడం ఇలాంటి సన్నివేశాలు ఏమాత్రం బాగాలేవని పరుచూరి విమర్శించారు. ఎఫ్2 సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే రియలిస్టిక్ సమస్యలను ఎంతో ఫన్నీగా చూపించారు. ఆ మూవీ చాలా బాగుంది.కానీ ఎఫ్ 3 సినిమా మొత్తం డబ్బు చుట్టే కథ మొత్తం నడిచేలా చూపించడం పెద్ద పొరపాటు అని పరుచూరి అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది