Varun Tej : వరుణ్ తేజ్ త్వరలో తాళి కట్టబోయేది ఈ అమ్మాయి కే .. !!

 Authored By aruna | The Telugu News | Updated on :3 February 2023,10:00 am

Varun Tej : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ ట్యాగ్ ను తగిలించుకున్నాడు. ‘ ముకుంద ‘ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. వైవిద్యమైన పాత్రలు చేస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో వేరియేషన్ చూపిస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడు. అయితే ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడని, వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Varun tej marriage news viral

Varun tej marriage news viral

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. అయితే వెంకటేష్ చిన్న కూతురు తో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రస్తావించారు. వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన ఇస్తాడని అన్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ కూతురితో వరుణ్ తేజ్ పెళ్లి కన్ఫర్మ్ అయినట్లు నాగబాబు చెప్పాడు. గతంలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ మధ్య ఎటువంటి సంబంధం లేదని నాగబాబు చెప్పుకొచ్చాడు.

Varun tej marriage news viral

Varun tej marriage news viral

వెంకటేష్ చిన్న కూతురుని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని జనాలు అనుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ జనాలు మాత్రం వెంకటేష్ చిన్న కూతురు మెగా కోడలు కాబోతుందని అంటున్నారు. ఈ విషయంపై వరుణ్ తేజ్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ గాండీవధారి అర్జున ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఎస్విసిసి పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి బాపినీడు బీవిఎస్ఎన్ ప్రసాదులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి