Varun Tej : వరుణ్ తేజ్ చేసుకోబోయేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి నే.. ఇదే సాక్ష్యం ?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varun Tej : వరుణ్ తేజ్ చేసుకోబోయేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి నే.. ఇదే సాక్ష్యం ??

 Authored By prabhas | The Telugu News | Updated on :21 February 2023,9:20 pm

Varun Tej : Varun Tej ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ చేసుకోబోయేది లావణ్య త్రిపాఠి నే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల నాగబాబు త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో వరుణ్ తేజ్ చేసుకోబోయేది లావణ్య అని జనాలు చర్చించుకుంటున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో మిస్టర్, అంతరిక్షం సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. అయినా వీరిద్దరి కాంబినేషన్ కి సూపర్ టాక్ ఉంది. వీరిద్దరు కూడా ప్రైవేట్ పార్టీలలో కలవడంతో ఇద్దరు ప్రేమించుకుంటున్నారని

Varun Tej married lavanya tripathi this is the proof

Varun Tej married lavanya tripathi this is the proof

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన నాగబాబు, లావణ్య త్రిపాఠి అదేమీ లేదని చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ మరోసారి ఆ వార్తలు నిజమే అయినట్లు చేసింది. రీసెంట్ గా లావణ్య నటించిన సినిమా పులిమేక. ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ కూడా కీలకపాత్రలో నటించింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమా అడ్డా షో కి వచ్చారు సినిమా యూనిట్. అయితే టాస్క్ లో భాగంగా సుమ లావణ్య త్రిపాఠిని ఓ ప్రశ్న అడిగింది.

Varun Tej married lavanya tripathi this is the proof

Varun Tej married lavanya tripathi this is the proof

మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని అడిగితే మీరు ఎవరి పేరు చెబుతారు అంటూ ఆప్షన్ ఏ నాని ఆప్షన్ బి వరుణ్ తేజ్ అని అడిగింది. దీనికి వెంటనే లావణ్య వరుణ్ తేజ్ అని ఆన్సర్ ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఆడియన్స్ అయితే ఓ అని అరి చేశారు. దీంతో వరుణ్ తేజ్ లావణ్య నే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై వరుణ్ తేజ్ స్పందించాల్సి ఉంటుంది. మరి పెళ్లి గురించి ఎప్పుడు అధికారిక ప్రకటన ఇస్తాడని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది