Veera Simha Reddy : వీరసింహా రెడ్డి బ్లాక్ బస్టర్ టాక్ మధ్యలో చిరంజీవి కి మరొక బిగ్ బ్యాడ్ న్యూస్ ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Veera Simha Reddy : వీరసింహా రెడ్డి బ్లాక్ బస్టర్ టాక్ మధ్యలో చిరంజీవి కి మరొక బిగ్ బ్యాడ్ న్యూస్ !

Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక కొద్ది రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా. ఇక బాలయ్య సినిమాతో పాటు చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా రేపు విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చిరంజీవి మైత్రి నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఈ సినిమాలో బాస్ పాట […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 January 2023,4:20 pm

Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక కొద్ది రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా. ఇక బాలయ్య సినిమాతో పాటు చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా రేపు విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చిరంజీవి మైత్రి నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఈ సినిమాలో బాస్ పాట కోసం భారీగా సెట్ వేయించారని, ఆ పాట బాగా వచ్చిన దానికోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సినిమా కథ బాగుంటే అదే సూపర్ హిట్ అవుతుందని చెప్పారు.

సినిమా మేకింగ్ నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్టర్స్ కూడా సినిమా బాగా వచ్చేలా చూసుకోవాలి అని అన్నారు. బాస్ పార్టీ సాంగ్ సెట్ కోసం మైత్రి నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. ఆ సెట్ వేసే ముందు నాతో చెప్పి ఉంటే నేను వద్దనే వాడిని అని అన్నారు. అయితే ఈ పాట సెట్ వావ్ అనిపించేలా ఉందని చెప్పారు. మైత్రి నిర్మాతలు మొదటి నుంచి వారి ప్రొడక్షన్లో సినిమాలను భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ నిర్మిస్తుంటారు. సినిమా గ్రాండ్ లుక్ రావడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. అందుకే చాలామంది స్టార్ హీరోలు ఈ సంస్థతో వరుస సినిమాలు చేస్తున్నారు.

veera simha reddy hit chiranjeevi not satisfied valter veeraiah movie makers

veera-simha-reddy-hit-chiranjeevi-not-satisfied-valter-veeraiah-movie-makers

ఈ నిర్మాణ సంస్థకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. దీనికి కారణం సినిమా కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడమే. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వాల్తేరు వీరయ్య మరో భారీ సినిమా అని తెలుస్తుంది. చిరంజీవి రవితేజ ల మధ్య వచ్చే సీన్స్ కి అభిమానులు విజిల్స్ వేసి గోల గోల చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. డైరెక్టర్ బాబి ఈ సినిమాపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. మరి వీరు చెప్పిన మాటలు చూస్తే సినిమా హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూస్తే వాల్తేరు వీరయ్య సినిమా రిజల్ట్ ఏంటో తెలుస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది