Namitha : శ‌ర‌త్ బాబుతో నా భార్య పెళ్లా.. దీనంత వ‌ర‌స్ట్ ఇంకోటి లేదంటూ న‌మిత భ‌ర్త‌ ఫైర్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Namitha : శ‌ర‌త్ బాబుతో నా భార్య పెళ్లా.. దీనంత వ‌ర‌స్ట్ ఇంకోటి లేదంటూ న‌మిత భ‌ర్త‌ ఫైర్

Namitha: బొద్దుగుమ్మ న‌మిత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2001లో మిస్‌ ఇండియా పోటీల్లో నాల్గవ స్థానంలో నిలిచింన న‌మిత ఆ తర్వాత ‘సొంతం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. విక్టరీ వెంకటేష్‌ సరసన ‘జెమినీ’ మూవీలో నటించి మరింత పాపులర్‌ అయ్యింది. ‘ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’, ‘నాయకుడు’ వంటి పలు చిత్రాల్లో నటించింది నమిత. బొద్దుగా మారిపోవడం వల్లే సినిమాల్లో కనిపించకుండా పోయిందన్న వార్తలు వినిపించాయి .ప్రభాస్‌ ‘బిల్లా’ సినిమాలో సెకండ్‌ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :26 January 2022,7:00 pm

Namitha: బొద్దుగుమ్మ న‌మిత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2001లో మిస్‌ ఇండియా పోటీల్లో నాల్గవ స్థానంలో నిలిచింన న‌మిత ఆ తర్వాత ‘సొంతం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. విక్టరీ వెంకటేష్‌ సరసన ‘జెమినీ’ మూవీలో నటించి మరింత పాపులర్‌ అయ్యింది. ‘ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’, ‘నాయకుడు’ వంటి పలు చిత్రాల్లో నటించింది నమిత. బొద్దుగా మారిపోవడం వల్లే సినిమాల్లో కనిపించకుండా పోయిందన్న వార్తలు వినిపించాయి .ప్రభాస్‌ ‘బిల్లా’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన న‌మిత‌.. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడించింది.

2017లో వీరేంద్ర చౌదరిని లవ్‌ మ్యారేజ్‌ చేసుకుని వైవాహిక జీవితానికి ఆరంభం పలికింది నమిత. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే కొత్తగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భౌవౌ అనే సినిమా చేస్తోంది. అయితే న‌మిత పెళ్లి త‌ర్వాత ప‌లు పుకార్లు చ‌క్క‌ర్లుకొడుతున్నాయి. సీరియల్ నటుడు శరత్ బాబుతో నమిత పెళ్లని.. ఆ వృద్ధ నటుడితో పీకల్లోతు ప్రేమలో ఈ యంగ్ బ్యూటీ ఉందని అప్పట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్‌పై నమిత భర్త వీరేంద్ర చౌదరి స్పందించారు.పెళ్లైన తరువాత నమిత నాతోనే ఉంటుంది.. నేనేంటో తనకి తెలుసు.. తనేంటో నాకు తెలుసు.. ఈ రూమర్స్ ఎలా వస్తున్నాయని నవ్వుకుంటూ ఉంటాం.

veerendra chowdary reacts on namitha sarath babu relation

veerendra chowdary reacts on namitha sarath babu relation

Namitha : బాధ‌ను వ్య‌క్తం చేసిన న‌మిత భ‌ర్త‌

నమిత కూడా పెద్దగా పట్టించుకోదు. రూమర్స్ అన్నింటిలోనూ వరస్ట్ రూమర్ ఏంటంటే.. శరత్ బాబుతో నమిత పెళ్లి అనే రూమర్. మా పెళ్లి టైంలోనే సీనియర్ నటుడు శరత్ బాబుతో నమిత పెళ్లి అని చాలా గాసిప్స్ వ‌చ్చాయి. దాన్ని మేం అంత సీరియస్‌గా తీసుకోలేదు . నాకు తెలిసి ఆయన కూడా ఈ రూమర్‌పై బాధపడి ఉంటారు. ఆయన చాలా పెద్దాయన.. సీనియర్ నటుడు.. అలాంటి వ్యక్తితో ఎఫైర్ అని రూమర్లు క్రియేట్ చేయడం చాలా తప్పు. ఇవి వారి వ్య‌క్తిగ‌త జీవితాల‌పై చాలా ప్ర‌భావం చూపుతాయి అని వారు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు అని వీరేంద్ర చౌద‌రి తెలియ‌జేశాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది