Tamilnadu Elections : ఎన్నికల ప్రచారంలో సినీ తార.. చివరకు అభ్యర్థే రాకపోవడంతో చిరాకుతో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamilnadu Elections : ఎన్నికల ప్రచారంలో సినీ తార.. చివరకు అభ్యర్థే రాకపోవడంతో చిరాకుతో?

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 April 2021,8:28 am

Tamilnadu Elections : ప్రస్తుతం దేశంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో తమిళనాడులో ఎన్నికల హడావుడి ఎక్కువైంది. రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలవాలా? అని ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువుండే తమిళనాడులో ఈసారి ఎలాగైనా గెలిచి తమిళనాడును ఏలాలని బీజేపీ బాగా కలలు కంటోంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తమిళనాడుపై బాగానే దృష్టి పెట్టారు.

bjp leader namitha election campaign in tamilnadu electioins

bjp leader namitha election campaign in tamilnadu electioins

అందుకే… తమిళనాడులో ప్రచారానికి ఏకంగా సినీ తార నమితను దించారు. తమిళనాడులో నమితకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. తనకు తన అభిమానులు గుడి కూడా కట్టారు. ఆ రేంజ్ లో నమితకు అభిమానులు ఉన్నారు కాబట్టే…. ఎన్నికల ప్రచారానికి ఏకంగా సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవడానికి బీజేపీ రెడీ అయింది.

అయితే… నమిత తాజాగా రామనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. నమిత రాగానే అక్కడి స్థానికులంతా ఎగబడ్డారు. తన ప్రసంగాన్ని వినడానికి గుంపులు గుంపులుగా వచ్చారు..

కానీ… ఎన్నికల ప్రచారంలో ఆమె చాలా సీరియస్ అయ్యారు. బీజేపీ నేతల తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tamilnadu Elections : నమిత వచ్చినా పత్తా లేని బీజేపీ అభ్యర్థి

ఓవైపు నమిత వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తుంటే… మరోవైపు బీజేపీ అభ్యర్థి కుప్పు రాము మాత్రం అక్కడికి రాలేదు. వచ్చీరాని తమిళంలో నమిత ఎలాగోలా ప్రచారం ప్రారంభించినా… అసలు అభ్యర్థి రాకపోవడంతో… తనకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. హోటల్ కు వెళ్లి పోయి అక్కడి నుంచి చెన్నై వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మరి… సినీ నటి నమితే ఏకంగా బీజేపీ కోసం ఎన్నికల ప్రచారానికి వస్తే… అక్కడి అభ్యర్థి ఎందుకు హాజరు కాలేదు అనేదానిపై ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది