Venkatesh : వెంకటేష్ కు కాబోయే అల్లుడు మొదటగా చేసుకోవాల్సింది ఈ హీరోయిన్ నే.. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఇలా ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venkatesh : వెంకటేష్ కు కాబోయే అల్లుడు మొదటగా చేసుకోవాల్సింది ఈ హీరోయిన్ నే.. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఇలా ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :2 November 2023,8:00 pm

ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఇళ్లల్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అలా ఇప్పటికే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరిగిపోయింది. ఇక రీసెంట్ గానే దగ్గుబాటి ఫ్యామిలీలో శుభకార్యం జరిగింది. విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. అలాగే యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఎంగేజ్మెంట్ కూడా ఇటీవల ఘనంగా జరిగింది. ఇక త్వరలోనే మిల్కీ బ్యూటీ తమన్న కూడా పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది . అయితే ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ రెండో కూతురు హయవాహిని కి విజయవాడ కి చెందిన వైద్యుడికి ఇచ్చి పెళ్లి చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఎంగేజ్మెంట్ ని చాలా గ్రాండ్గా జరిపించారు. అయితే వెంకటేష్ కాబోయే అల్లుడు ముందుగా ఓ హీరోయిన్ ని చేసుకోవాలనుకున్నాడట. కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వలన వెంకటేష్ కూతురుని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్ కి కాబోయే అల్లుడు ఆకాష్ పెద్ద పేరున్న గైనకాలజిస్ట్. విజయవాడలో మంచి పేరున్న డాక్టర్ అట. అంతేకాదు ఆయనకు వచ్చే సంపాదన స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉంటుందని, కోట్లలో సంపాదిస్తారని అంతేకాకుండా మంచి గుణగణాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే తాజాగా అతడికి సంబంధించి ఓ వార్త నెట్ ఇంట వైరల్ గా మారింది.

If Niharika rejects him.. will he go as Venkatesh's son-in-law?

అయితే అతను ముందుగా పెళ్ళి చేసుకోవాలి అనుకున్నది హయవాహిని కాదట. మెగా డాటర్ నిహారిక నట. అయితే నిహారిక ను పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలు భావించిన నిహారిక డాక్టర్ను చేసుకోవడం ఇష్టం లేక అతడిని రిజెక్ట్ చేసి జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. అలా నిహారిక కాదనడంతో ఆకాష్ ఫ్యామిలీ వెంకటేష్ కూతురుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అలా నిహారిక చేసుకోబోయే అబ్బాయిని హయవాహిని పెళ్లి చేసుకోబోతుందని వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది