Vennela Kishore : వెన్నెల కిషోర్‌కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. నా కోడలు పిల్ల జోలికి రావొద్దంటూ..?
Vennela Kishore : టాలీవుడ్ ఇండస్ట్రీలో వెన్నెలకిషోర్ ప్రస్తుతం టాప్ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. మొన్నటివరకు బ్రహ్మానందం తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ఆయనకు వయసు మీద పడటంతో పెద్దగా కామెడీ పాత్రలు పోషించేందుకు బ్రహ్మీ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దీనికి తోడు ఆయనకు కమెడియన్ గా అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదని టాక్ వస్తోంది. తెలుగు చిత్రపరిశ్రమలో వెన్నెల కిషోర్ కామెడీకి ప్రత్యేక స్థానం ఉంది. నటుడు, కమెడియన్‌గా అతని నటనా ప్రావీణ్యానికి ప్రత్యేక మైన గుర్తింపు ఉంటుంది.
స్టార్ హీరోలకు ఫ్రెండ్ గా కూడా ఆయన మంచి క్యారెక్టర్స్ చేస్తూ తన కంటూ ఇండస్ట్రీలో ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ కమెడియన్ కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు. తన పంచులతో ఆడియెన్స్ కు ఆహ్లాదాన్ని పంచుతుంటాడు. కాగా, ప్పుడు ఎవరిని హర్ట్ చేయని వెన్నెల కిషోర్ మొదటిసారి తన మాటలతో హీరోయిన్ కృతి శెట్టిని ఏడిపించాడట.. అనంతరం ఈ విషయం తెలిసి అక్కినేని నాగార్జున వెన్నెల కిషోర్ ను తిట్టడంతో పాటు వార్నింగ్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. వెన్నెల కిషోర్ రీసెంట్ గా బంగార్రాజు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున, నాగచైతన్యతో పాటు కృతిశెట్టి నటించింది.

nagarjuna strong warning to vennela kishore
Vennela Kishore : నాగ్ ఎందుకు సీరియస్ అయ్యాడంటే..
ఈ సినిమాలో భాగంగా వెన్నెల కిషోర్ హీరోయిన్ మధ్యలో కొన్ని కామెడీ సన్నివేశాలు ఉంటాయి. అయితే, సెట్ లో వెన్నెల కిషోర్ కృతిశెట్టి మీద కొన్ని కామెంట్స్ చేశాడట..దీంతో హీరోయిన్ హర్ట్ అయి ఏడ్చిందట.. అనంతరం నాగార్జున దగ్గరకు వెళ్లి తనను ఆటపట్టిస్తున్నారని చెప్పడంతో నాగ్.. వెన్నెల కిషోర్ ను పిలిపించి క్లాస్ పీకాడట.. కొత్తగా వచ్చిన హీరోయిన్.. తనకు భాష కూడా రాదని.. ఇలా కామెంట్స్ చేసి ఏడిపించవద్దని వార్నింగ్ ఇచ్చాడట.. మళ్లీ రిపీట్ అయితే రెమ్యూనరేషన్ కట్ చేయిస్తానని హెచ్చరించడట.. నా కోడలి పిల్లకు దూరంగా ఉండాలని సూచించాడట.. బంగార్రాజు మూవీలో కృతిశెట్టి నాగ్ కోడలిగా నటించిన విషయం తెలిసిందే.