Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సినిమా ఈవెంట్స్ కి రాకపోవడానికి రీజన్ అదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సినిమా ఈవెంట్స్ కి రాకపోవడానికి రీజన్ అదేనా..?

 Authored By ramu | The Telugu News | Updated on :20 December 2024,9:04 pm

Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నాడు. సోలో సినిమాలతో పాటు స్టార్ సినిమాల్లో కమెడియన్ గా తన మార్క్ చూపిస్తున్నాడు. వెన్నెల సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన కిశోర్ ఆ సినిమాలో తన కామెడీతో వెన్నెల కిశోర్ గా మారాడు. సో వెన్నెల కిశోర్ సినిమాలో ఉన్నాడు అంటే కామెడీ అదిరిపోయినట్టే ఉంటుంది. స్టార్ కమెడియన్ గా వెన్నెల కిశోర్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా అతనిలో ఉన్న ఒక మైనస్ మాత్రం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. స్టార్ కమెడియన్ లో మైనస్ పాయింటా అదేంటి అనుకోవచ్చు. స్టార్ కమెడియన్ గా వెన్నెల కిశోర్ తన పంచులతో అదిరిపోయే రేంజ్ కామెడీ పండిస్తాడు. ఐతే ఇంత కామెడీ చేసే వెన్నెల కిశోర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు మాత్రం అస్సలు రాడు. వెన్నెల కిశోర్ సోలోగా నటించిన సినిమా అయినా సరే లేదా పెద్ద హీరో సినిమాలో కమెడియన్ గా నటించినా సరే ఎందుకో సినిమా ఈవెంట్స్ కి మాత్రం కిశోర్ అసలు అటెండ్ అవ్వడు.

Vennela Kishore స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సినిమా ఈవెంట్స్ కి రాకపోవడానికి రీజన్ అదేనా

Vennela Kishore : స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సినిమా ఈవెంట్స్ కి రాకపోవడానికి రీజన్ అదేనా..?

Vennela Kishore ఈవెంట్స్ లో పాల్గొంటే మిగతా వారిని కూడా..

ఐతే దాని వెనక ఒక బలమైన రీజన్ ఉందని తెలుస్తుంది. స్టార్ కమెడియన్ గా వెన్నెల కిశోర్ ఎందుకు సినిమా ఈవెంట్స్ కు రాడంటే ఈవెంట్స్ కి వస్తే తనని ఎవరైనా పొడిగితే ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదట. అంతేకాదు ఈవెంట్స్ లో పాల్గొంటే మిగతా వారిని కూడా తాను పొగడాల్సి వస్తుందని కూడా వెన్నెల కిశోర్ సినిమా ఈవెంట్స్ కు రాడని తెలుస్తుంది. ఇదేమంత సీరియస్ ప్రాబ్లెం కాదు కదా అనుకోవచ్చు. తనకు అది ఇబ్బంది కాబట్టే వెన్నెల కిశోర్ ఇలా చేస్తున్నాడట.

ప్రస్తుతం వెన్నెల కిశోర్ శ్రీకాకుళం షెర్లా హోంస్ సినిమాలో నటించాడు. ఆ సినిమా డిసెంబ 25న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఈవెంట్ కి కూడా వెన్నెల కిశోర్ హ్యాండ్ ఇచ్చాడు. తను లీడ్ రోల్ చేసిన సినిమాకు కూడా వెన్నెల కిశోర్ అటెండ్ అవ్వకపోవడంపై కొందరు అసంతృప్తిగా ఉన్నా తన రూల్ బుక్ లో ఈవెంట్స్ కి అటెండ్ అవ్వకూడదని పెట్టుకున్నాడు కాబట్టే వెన్నెల కిశోర్ దాన్ని ఫాలో అవుతున్నాడని చెప్పుకుంటున్నారు. Vennela Kishore, Events, Movie, Srikakulam Sherlak Homes, Tollywood

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది