Venu Swamy : నిహారిక గురించి చెబుతూ చిరంజీవి కూతురు శ్రీజ పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!!
Venu Swamy : కొద్ది రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకోవడం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీకి పెళ్లి అచ్చురాలేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ ఆస్ట్రాలజర్ సెలబ్రిటీల జీవితాలలో జరగబోయేది ముందే చెప్పి తెలుగు రాష్ట్రాలలో పేరు సంపాదించిన వేణు స్వామి.. నిహారిక విడాకులు గురించి మాట్లాడుతూ చిరంజీవి కూతురు శ్రీజ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువు నీచంలో ఉంటే ఎవరు ఏమి చేయలేరు.
శ్రీజ జాతకంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆమె త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతుంది. వరుడు మరెవరో కాదు.. ఆమె ఫ్రెండ్ నే రెండు.. మూడు నెలలో చేసుకోబోతుంది అని తెలిపారు. పవన్ కళ్యాణ్ జాతకం తరహాలోనే వీల జాతకాలు ఉన్నాయి. శ్రీజ జాతకంలో మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయి కెమెరా ముందు ఇప్పుడే చెబుతున్నాను అని వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అదే రీతిలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కి కూడా మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని.
ఆయన జాతకం ఆ రకంగా ఉంది అంటూ వేణు స్వామి వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి జాతకంలో గురువు నీచనిబట్టి.. అతని వైవాహిక జీవితాన్ని అంచనా వేయవచ్చు అని అన్నారు. పవన్ మరియు శ్రీజ జాతకం ఒకటే. వాళ్ళిద్దరి జాతకంలో గురువు నీచంలో ఉన్నాడు.. కాబట్టి మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు అవ్వచ్చు అని వేణు స్వామి తెలిపారు.