Venu Tillu : “బలగం” స్టోరీ నాది చిల్లర కోసం నీ వేషాలు నాకు తెలుసు తగ్గేదేలే… వేణు సంచలన వ్యాఖ్యల వీడియో..!!
Venu Tillu : ఫస్ట్ టైం జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా బలగం అనే సినిమా తీయడం జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. అయితే ఈ సినిమా స్టోరీ పై వివాదం నెలకొంది. పలగం సినిమా స్టోరీ 2011లో రాసుకున్నట్లు గడ్డం సతీష్ అనే పాత్రికేయుడు వెల్లడించారు. అంతేకాదు “పచ్చికి” అనే పేరుతో.. తన కథ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిందని […]
Venu Tillu : ఫస్ట్ టైం జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా బలగం అనే సినిమా తీయడం జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. అయితే ఈ సినిమా స్టోరీ పై వివాదం నెలకొంది. పలగం సినిమా స్టోరీ 2011లో రాసుకున్నట్లు గడ్డం సతీష్ అనే పాత్రికేయుడు వెల్లడించారు. అంతేకాదు “పచ్చికి” అనే పేరుతో.. తన కథ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిందని వివరించాడు. ఈ కథ కారణంగానే నమస్తే తెలంగాణ దినపత్రికలో ఉద్యోగం లభించినట్లు చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో బలగం సినిమా టైటిల్స్ లో తన పేరు వేయాల్సిందేనని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ వివాదంపై బలగం డైరెక్టర్ వేణు స్పందించారు. ఈ సినిమా స్టోరీ విషయంలో పాత్రికేయుడు వివాదం సృష్టించటం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో కాకి ముట్టుడు అనే సాంప్రదాయాన్ని చూపించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సాంప్రదాయం తెలంగాణ ప్రాంతానికే కాదు తెలుగు వారందరికీ సాంప్రదాయమని స్పష్టం చేశారు. ఆయన ఎవరో సతీష్ అంట అసలు ఆయన ఎవరో కూడా నాకు పెద్దగా తెలియదు. ఆయన కథ కూడా నేను చదవలేదు. కాకి ముట్టుడు అనేది చరిత్ర తెలుగు వారందరికీ ఇచ్చిన సాంప్రదాయం.
ఇది ఎవరి సొత్తు కాదు. దీనిపై ఎవరైనా స్పందించవచ్చు. ఇది నాది అంటే ఎలా… చావుపై అనేక భాషలలో చాలా సినిమాలు వచ్చాయి. న్యాయపరంగా చూసుకుంటానని ఆ పాత్రికేయడంటున్నారు సంతోషంగా వెళ్ళమని చెబుతున్నా. చట్టం నేను చెబితే అది చేద్దాం. ఈ విషయంలో ఏదైనా ఉంటే నాతో చూసుకోండి గాని నిర్మాత దిల్ రాజు గారిని లాగొద్దు. బలగం సినిమా డైరెక్టర్ రచయిత నేనే. దిల్ రాజును లాగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే స్టోరీ తీసుకుని దిల్ రాజు వద్దకు వెళ్ళండి… ఆయనే మీకు అవకాశం ఇస్తారు కదా అంటూ వేణు సంచలన వ్యాఖ్యలు చేశారు.