Dil Raju : పవన్ కల్యాణ్ సినిమాలని ఆపే దమ్ము ఎవరికి ఉంది.. దిల్ రాజు స్టన్నింగ్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Dil Raju : పవన్ కల్యాణ్ సినిమాలని ఆపే దమ్ము ఎవరికి ఉంది.. దిల్ రాజు స్టన్నింగ్ కామెంట్స్..!
Dil Raju : ఇటీవల థియేటర్స్ బంద్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో దిల్ రాజు ప్రెస్‌మీట్ ఏర్పాటు. ఈ క్రమంలో ఆయన పవన్ కల్యాణ్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ అండ్ పర్సంటేజ్ విధానం నడుస్తోంది. ఫస్ట్ వీక్ రెవెన్యూ బాగా వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్స్ తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నాం. పర్సంటేజ్ సమస్య ఈస్ట్ నుంచి మొదలై నైజాంకు వచ్చింది అని చెప్పారు.

Dil Raju : పవన్ కల్యాణ్ సినిమాలని ఆపే దమ్ము ఎవరికి ఉంది.. దిల్ రాజు స్టన్నింగ్ కామెంట్స్..!
Dil Raju ఎవరికి లేదు..
నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటే, ఎస్వీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్స్ 30 మాత్రమేనని దిల్ రాజు తెలిపారు. ‘ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్స్ ఓనర్స్, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఇండస్ట్రీలో ‘ఆ నలుగురు’ అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోంది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు అని చెప్పారు.
ఇండస్ట్రీలో పవన్ సినిమాలు ఆపే ధైర్యం ఎవరికీ లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ చెబితే వద్దని వారించాను. ఛాంబర్‌కు వాళ్ల పర్సంటేజీల విషయంలో లేఖ రాశారు. వాళ్లు అనుకున్నది జరగకుంటే బంద్ చేస్తామనేది కేవలం ఆలోచన మాత్రమే. కొవిడ్ టైంలో తప్ప ఎప్పుడూ థియేటర్స్ బంద్ కాలేదు. మంత్రి దుర్గేష్ గారు నాకు ఫోన్ చేస్తే అది తప్పుడు సమాచారం అని చెప్పాను. జూన్‌లో పెద్ద సినిమాల రిలీజ్ ఉంది. ఆ టైంలో పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే మా ఆలోచన అని అన్నారు. ఓ సందర్భంలో తప్పుడు మెసేజ్ పవన్ దగ్గరకు వెళ్లి ఉంటుంది, అందుకే ఆయనకి కోపం వచ్చిందని చెప్పారు.