Vijay Devarakonda : కారులో ఆ పని ఇష్టం అంటూ విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..
Vijay Devarakonda : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఈ చిత్రానికి క్యాప్షన్. అనన్య పాండే కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఆగస్ట్ 22న సినిమా విడుదల కానుండగా, ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జోరుగుతున్నాయి. ఇందులో భాగంగా కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోకి విజయ్ దేవరకొండ, అనన్య పాండే హాజరయ్యారు. ఇందులో వారు చెప్పే ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి..
నువ్వు ఎప్పుడు చివరగా ఆపని చేసావు అని అడిగారు కరణ్ జోహార్ . దానికి విజయ్ దేవరకొండ సమాధానం చెప్పబోతూంటే ప్రక్కనే ఉన్న అనన్య పాండే అందుకుని ఈ రోజు ఉదయం అయ్యి ఉండచ్చు అని చెప్పింది. దానికి కరణ్ జోహార్ కౌంటర్ వేసారు. దానికి విజయ్ దేవరకొండ పెద్దగా నవ్వేసారు.నువ్వు పబ్లిక్ ప్లేస్ లలో చేయటానికి ఇష్టపడతావా లేక అంటే విజయ్ దేవరకొండ కార్స్ అన్నాడు. అక్కడ కంపర్టబుల్ గా ఉంటుందా అని అడిగారు. దానికి విజయ్ దేవరకొండ డెస్పరేట్ టైమ్స్ అంటే దాదాపు తప్పించుకోలని కక్కుర్తి గా ఉన్న పరిస్దితుల్లో అన్నట్లు సమాధానం చెప్పి కన్ను కొట్టారు.
Vijay Devarakonda : బయటపెట్టేశాడు..
ఇక నా పార్టీలో నువ్వు ఆ హీరోతో కలిసి ఏం చేస్తున్నావంటూ… అడిగేశాడు కరణ్ . అయితే కరణ్ ప్రశ్నకు అడ్డు తగులుతూ.. స్టాప్ స్టాప్ నువ్వుఏం చూడలేదు.. నేను ఏం చేయలేదు అంటూ.. చెప్పింది. ఇంతకీ కరణ్ తీసుకున్న పేరు ఏ హీరోది అంటే.. ఆదిత్య రాయ్ కపూర్. కరణ్ జోహార్ అనన్యను ప్రశ్నిస్తు.. నీకు నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌కి మధ్య ‘ఏం జరుగుతోంది’ అని అడిగాడు. ఆ ప్రశ్న వేయగానే.. విజయ్ ఓహ్.. అంటూ అనన్య ముఖం చూశాడు.ఇక అనన్య కూడా మొహం వాడిపోయేలా పెట్టింది. ఇప్పుడు ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.