Vijay Devarakonda : ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో ఇబ్బందులెదుర్కొంటాడా విజయ్ దేవరకొండ ..?
Vijay Devarakonda : టాలీవుడ్‌లో ఒక్కోసారి మన హీరోలకు వరుసగా హిట్స్ వచ్చాయంటే కాస్త ఓవర్ కాన్‌ఫిడెన్స్ పెరిగిపోయి ఎడాపెడా ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అనవసరంగా ఫ్లాపులు నెత్తిమీద పెట్టుకుంటుంటారు. ఇప్పటికే, ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్న హీరోలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఎందుకనో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి టాకే సోషల్ మీడియాలో వినిపిస్తోంది. విజయ్ ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమాను పాన్ ఇండియన్ లెవల్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. తన కెరియర్ మొదలైన ఈ 6 ఏళ్ళలో 10 సినిమాలు చేసిన విజయ్, అందులో క్లీన్ హిట్స్ గా నిలిచింది 3 సినిమాలు మాత్రమే. ఒకటి యావరేజ్ సినిమా, మిగిలిన ఆరు సినిమాలు బాక్స్ ఆఫీస్ దెగ్గర ప్లాప్ గా మిగిలాయి.
2018 నుంచి దేవరకొండ 6 సినిమాలు చేస్తే, వీటిలో గీత గోవిందం మాత్రమే హిట్ సాధించింది. అంతేకాదు ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది. అర్జున్ రెడ్డి సినిమా సెన్షేషనల్ హిట్. దాంతో తన మార్కెట్ ని పెంచుకునేందుకు ఆరాటపడ్డాడు. ఆ ఊపులోనే డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, నోటా, లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే, ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేతికిల పడ్డాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో విజయ్ మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. ఎంతసేపటికీ అర్జున్ రెడ్డి సినిమాలో మాదిరిగానే విజయ్ లుక్స్ అండ్ యాక్టింగ్ లో మొనాటమి వచ్చేసింది.. అనే విమర్శలు కూడా వచ్చాయి. విజయ్ ప్రస్తుతం మూడు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. అందులో రెండు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తోనే చేస్తుండడం విశేషం.

Vijay Devarakonda is having trouble with overconfidence
Vijay Devarakonda : పూరి ఎప్పుడు హిట్ ఇస్తాడో, ఎప్పుడు ప్లాప్ ఇస్తాడో ఎవరూ ఊహించలేరు.
మరో సినిమా ‘ఖుషి’ అనే టైటిల్ తో శివ నిర్వాణ రూపొందిస్తున్నాడు. పూరి ఎప్పుడు హిట్ ఇస్తాడో, ఎప్పుడు ప్లాప్ ఇస్తాడో ఎవరూ ఊహించలేరు.ఇక శివ నిర్వాణ ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు క్లాస్ ఆడియన్స్‌ను మాత్రమే మెప్పించాయి. వీటిలోనూ ఒక సినిమా ఫ్లాప్. అలాంటిది ఇప్పుడు చేస్తున్న ఖుషి సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని మేపిస్తాడా అంటే..చాలామందిలో అనుమానాలున్నాయి. విజయ్ కి పూరి గనక లైగర్ సినిమాతో హిట్ ఇస్తే, గ్యారెంటీగా విజయ్ కి దక్కే క్రేజ్ వేరే లెవల్. ఏదేమైనా లైగర్ సినిమా సక్సెస్ మీదే విజయ్ మార్కెట్ ఆధారపడి ఉందనేది వాస్తవం. పాన్ ఇండియన్ సినిమాలతో పాటు ఖుషి వంటి డీసెంట్ సినిమాను ఒప్పుకోవడం కాస్త ఓవర్ కాన్‌ఫిడెన్స్ అనే కానెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, వీటిని విజయ్ ఫ్యాన్స్ ఒపుకోవడం లేదు.