Kingdom Movie : ఫ్యాన్స్‌కి రెండు హామీలు ఇచ్చిన విజయ్ దేవరకొండ.. కింగ్ మూవీ హిట్ కొడుతున్నాం..!
ప్రధానాంశాలు:
Kingdom Movie : ఫ్యాన్స్‌కి రెండు హామీలు ఇచ్చిన విజయ్ దేవరకొండ.. కింగ్ మూవీ హిట్ కొడుతున్నాం..!
kingdom Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి Vijay Devarakonda గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. ఆ తర్వాత ఆరేడు సినిమాలు చేసినా ఒక్క మంచి హిట్ రాలేదు. ఇప్పుడు ఈ నెల 31న కింగ్ డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ్ పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చారు.
kingdom Movie : ఫ్యాన్స్‌కి రెండు హామీలు ఇచ్చిన విజయ్ దేవరకొండ.. కింగ్ మూవీ హిట్ కొడుతున్నాం..!
kingdom Movie : ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
మరో మూడు రోజుల్లో కలవబోతున్నామని, అయితే సినిమా రిలీజ్ అవుతుందంటే కాస్త టెన్షన్‌గా ఉందని, అదే సమయంలో మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉందన్నారు విజయ్. సినిమా ఔట్‌పుట్ చూసుకున్నామని, కచ్చితంగా కొట్టబోతున్నామనే ఫీలింగ్ కలిగిందన్నారు. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు.
ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు. నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరు గర్వపడే సినిమా చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా.మీరందరు సంతోషపడేలా, పాజిటివ్‌గా ఫీలయ్యేలా, మిమ్మల్ని సెటిల్ చేసేలా ఏదైనా చేసే వెళ్తాను. ఈరెండు కచ్చితంగా చేసి తీరుతా` అని తెలిపారు విజయ్.