Vijay Devarakonda : సౌత్ వర్సెస్ నార్త్ విషయంపై విజయ్ దేవరకొండ స్పందన
Vijay Devarakonda : బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి మారింది. ఈ సినిమా అందించిన ఉత్సాహంతో చాలా మంది దర్శకులు అనేక ప్రయోగాలు చేశారు. అవన్నీ కూడా మంచి ఫలితాన్ని అందించాయి. దీంతో టాలీవుడ్ స్థాయి మరింత పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్‌పైనే ఉంది. అయితే టాలీవుడ్ స్థాయి రోజురోజుకి పెరుగుతున్న సమయంలో బాలీవుడ్ బోర్లా బొక్కల పడుతుంది. ఈ నేపథ్యంలో సౌత్ వర్సెస్ నార్త్ అన్న చందాన మారింది. దీనిపై తాజాగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా మారాడు విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలపై అభిమానులలో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ నటించిన ‘లైగర్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ మరియు ముంబై నగరాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ నిర్వహించారు. అంధేరీలో జరిగిన ఈవెంట్ కు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ గెస్టుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తమకు మద్దతు తెలిపినందుకు ఎనర్జీకి మారు పేరైన రణ్ వీర్ సింగ్ కి ధన్యవాదాలు తెలిపాడు. ‘నార్త్ ఇండస్ట్రీలో ఎంతోమంది సౌత్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఉత్తరాది నుంచి ఎంతోమంది యాక్టర్స్ దక్షిణాదిలో స్థిరపడ్డారు. తెలుగు తమిళ దర్శకులు ఇప్పుడు ఉత్తరాదిలో సినిమాలు తీస్తున్నారు’ అని వీడీ అన్నారు. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ సౌత్ సినిమాతోనే అరంగేట్రం చేశారనే విషయాన్ని విజయ్ గుర్తు చేశాడు. అలానే ఉత్తరాదిలో సత్తా చాటిన అతిలోక సుందరి శ్రీదేవి కూడా దక్షిణాది నుంచే వచ్చారని తెలిపారు. సినిమా అంటేనే వివిధ భాషల ఇండస్ట్రీలు కలిసి పని చేయాల్సి వస్తుందని.. సౌత్ చిత్రాలకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ వల్ల పోలికలు పాన్ ఇండియా చర్చలు జరుగుతున్నాయని వీడీ అభిప్రాయ పడ్డారు.
ఇకపై నార్త్ – సౌత్ అని విభజించి మాట్లాడకుండా.. కేవలం ఇండియన్ సినిమా – ఇండియన్ యాక్టర్ అని పిలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.విజయ్ ఇంత హుందాగా స్పందించడంతో అక్కడి వారు కూడా సంబరపడిపోతున్నారు. త్వరలో ఆయన పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయం అంటున్నారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ”లైగర్” సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. హిందీ సినిమా చేయకుండానే నార్త్ లో క్రేజ్ ఏర్పరచుకున్న వీడీ.. ఈ మూవీతో నేషనల్ వైడ్ సత్తా చాటాలని చూస్తున్నాడు.
‘లైగర్’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్ – ఛార్మీ కౌర్ – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ – మైక్ టైసన్ కీలక పాత్రలు పోషించారు. ‘లైగర్’ చిత్రాన్ని తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీభాషల్లో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
లైగర్, జనగణమన చిత్రాలే కాకుండా ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ విజయ్ దేవరకొండకు చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయట. జనగణమన చిత్రం తర్వాత ఈ మూవీ చేస్తారట. ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే ఇది సోసియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కనుందట. దర్శకుడు పూరి కెరీర్ లో మొదటిసారి సోసియో ఫాంటసీ చిత్రం విజయ్ దేవరకొండలో చేయనున్నాడట. జనగణమన చివరి దశలో ఈ ప్రాజెక్ట్ ప్రకటన ఉంటుంది అంటున్నారు. వరుస పరాజయాలతో డీలాపడ్డ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. భారీగా లాభాలు ఆర్జించాడు. ఇస్మార్ట్ శంకర్ విజయం ఇచ్చిన ఊపులో పూరి హీరో విజయ్ దేవరకొండతో లైగర్ ప్రకటించారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే పూరి-విజయ్ మరో ప్రాజెక్ట్ ప్రకటించారు. జనగణమన టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం జనగణమన సెట్స్ పై ఉంది.