Vikram : స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్‌కి గుండె పోటు.. ఖండించిన స్నేహితులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vikram : స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్‌కి గుండె పోటు.. ఖండించిన స్నేహితులు

 Authored By sandeep | The Telugu News | Updated on :8 July 2022,3:35 pm

Vikram : వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే విక్రమ్ వ‌రుస సినిమాలతో ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచుతున్న విష‌యం తెలిసిందే. కెరీర్‌లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషించిన విక్ర‌మ్ తాజాగా గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు ప్ర‌చారాలు జ‌రిగాయి. ఆయన్ని చెన్నై కావేరి హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశార‌ని అంటున్నారు. కాని తాజాగా ఆయ‌న పీఆర్ టీం స్పందిస్తూ… వైర‌ల్ ఫీవ‌ర్‌తో జాయిన్ అయ్యారు, త‌ప్ప ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు అని స‌న్నిహితులు తెలియ‌జేశారు.శివపుత్రుడు, అపరిచితుడు, మజా, ఐ సహా ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. శివ పుత్రుడు తర్వాత విక్రమ్‌కి తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

దాంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన సినిమాలకు మార్కెట్ క్రియేట్ అయ్యింది. కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. విక్రమ్ నటించిన ప్రతీ సినిమా తెలుగులోనూ విడుదలై చక్కటి ఆదరణ పొందుతుంటోంది. ఇటీవల ‘మహాన్’గా ప్రేక్షకులను OTTఅమెజాన్ ప్రైమ్ లో పలకరించాడు విక్రమ్. ఈ సినిమాతో నటుడిగా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విక్రమ్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోబ్రా’ పిక్చర్ ఈ ఏడాది ఆగస్టు11న విడుదలు చేయనున్నట్లు తెలిపారు. KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ పిక్చర్ లో హీరోయిన్ గా నటించింది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించగా, స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.

vikram gets heart stroke

vikram gets heart stroke

Vikram : షాకింగ్ న్యూస్..

పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన తారలుగా నటించారు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్‌ పాత్రలో విక్రమ్‌ నటిస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. అలాగే ‘చోళ కీరట రాజు. భయంకరమైన యుద్ధవీరుడు, ది వైల్డ్‌ టైగర్‌’ అంటూ విక్రమ్‌ కొత్త పోస్టర్‌ను ఇటీవ‌ల రిలీజ్‌ చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది