Vishnu Priya : స్టేజ్ పై బరితెగించేసిన విష్ణుప్రియ, మానస్ ల రొమాన్స్ .. చూస్తే తట్టుకోలేరు … వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 January 2023, 11:00 am

Vishnu Priya : ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే షో లు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. షో లు కూడా సినిమాలకు ఏమాత్రం తీసుకుపోవడం లేదు. డ్రామాకు డ్రామా, కామెడీ కి కామెడీ, రొమాన్స్ కి రొమాన్స్ అన్నీ ఉండేలా చూసుకుంటూ షోలను సూపర్ హిట్ చేస్తున్నారు. బుల్లితెరపై షోలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈటీవీ. ప్రతి పండుగకి కచ్చితంగా ఏదో ఒక ఈవెంట్ చేస్తూ జనాలను అలరిస్తుంది. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీ వారు చేసిన ప్రోగ్రాం ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఇక త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతుంది.

దీని సందర్భంగా మంచి రోజులు వచ్చాయి పేరుతో ఓ ప్రోగ్రాం ని ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమోని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. అందులో విష్ణు ప్రియ, మానస్ లు డాన్స్ ఇరగదీసారు. షార్ట్ ఫిలిం యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ‘ పోవే పోరా ‘ ప్రోగ్రాం చేసి యాంకర్ గా మారింది. ఈ షో లో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసి పాపులర్ అయింది. ఇటీవల సుడిగాలి సుదీర్ తో కలిసి ‘ పండుగాడ్ ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అంతగా ఆడలేదు. దీంతో మళ్లీ షోలు, ఆల్బమ్స్ చేసుకుంటుంది.

Vishnu Priya Manas dance performance in etv show

Vishnu Priya Manas dance performance in etv show

ఇటీవల మానస్ తో కలిసి జరీ జరీ పంచ కట్టి అని ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. దీంతో ఈసారి సంక్రాంతి ఈవెంట్ కి విష్ణుప్రియ, మానస్ లను ప్లాన్ చేశారు. అందులో వీరిద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటారు. వీళ్ళిద్దరి తరపున బంధువులు వస్తారు. అలా వీళ్ళిద్దరి పెళ్లి కోసం జరిగే హంగామా నే ప్రోగ్రామ్ గా తీశారు. అయితే విష్ణు ప్రియ మానస్ స్టేజ్ పై నీ వర్షం సాక్షిగా అనే పాటకు డ్యాన్స్ వేశారు. అయితే వీళ్ళిద్దరూ డాన్స్ చేసినట్లుగా కాకుండా ఫుల్ రొమాంటిక్ గా డాన్స్ వేశారు. స్టేజ్ పై వీళ్ళిద్దరూ రొమాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అయిపోయారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి