Vishnu Priya : నా హ్యాండ్ బ్యాగ్‌లో అది కచ్చితంగా ఉండాల్సిందే : యాంకర్ విష్ణుప్రియ
Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ఇప్పుడు బుల్లితెరపై ఎంత సరదాగా ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఉంటుంది. ఈ మధ్య అయితే విష్ణుప్రియ అందాల విందు శ్రుతి మించుతోంది. విచ్చలవిడిగా అందాలను ప్రదర్శిస్తోంది. వింత వింత ఫోటో షూట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్య బ్యూటీ ప్రొడక్ట్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అయితే విష్ణుప్రియ ఎక్కువగా ఫిట్ నెస్, గ్లామర్ మీద దృష్టి పెడుతుందన్న సంగతి తెలిసిందే.

Vishnu Priya On Her Beauty Product
విష్ణుప్రియ బయటకు వెళ్తే పెద్ద హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వస్తుందట. శ్రీముఖి నిర్వహించినర ఉమనియా అనే షోలో విష్ణుప్రియ తన సీక్రెట్లన్నీ కూడా చెప్పేసింది. హ్యాండ్ బ్యాగులో ఏఏ వస్తువులుంటాయో విప్పి చూపించింది. తినే వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటాను అని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఇక మేకప్‌కు సంబంధించిన ప్రాడక్ట్స్ కూడా ఉంటాయని చూపించింది. అయితే తాజాగా తన హ్యాండ్ బ్యాగులో కచ్చితంగా ఇది ఉంటుదని ఓ వస్తువును గురించి చెప్పింది.
Vishnu Priya : బ్యూటీ ప్రొడక్ట్ గురించి చెప్పిన విష్ణుప్రియ

Vishnu Priya On Her Beauty Product
అసలే ఇప్పుడు విష్ణుప్రియ బ్యూటీ ప్రొడక్ట్‌ల గురించి ప్రమోషన్ కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ప్రొడక్ట్ గురించి చెప్పింది. బీట్రూట్ ఫ్లేవర్‌తో ఉన్న ఈ బ్యూటీ ప్రొడక్ట్ తన హ్యాండ్ బ్యాగులో కచ్చితంగా ఉంటుందని, తన మేకప్ పౌచ్‌లో ఇది ఉండాల్సిందేనని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. డేగా ఆర్గానిక్స్ అంటూ ఆ ఉత్పత్తుల గురించి విష్ణుప్రియ బాగానే ప్రమోట్ చేస్తోంది. చివరగా విష్ణుప్రియ ది బ్యూటీ అండ్ బేకర్స్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.