Vishnu Priya : మరోసారి ప్రేమను బయటపెట్టేసింది.. అఖిల్ అంటే విష్ణుప్రియకు అంత పిచ్చి!
Vishnu Priya అక్కినేని వారబ్బాయి, యువ హీరో అఖిల్ అంటే అమ్మాయిలకు పిచ్చి. సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకోకపోయినా అమ్మాయిల మనసు దోచుకోవడంలో మనోడు బాగానే సక్సెస్ అయ్యాడు. అఖిల్ ని అమితంగా ఇష్టపడే వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు యాంకర్ విష్ణు ప్రియ. ఇప్పటికే ఎన్నోసార్లు అఖిల్ పై ఉన్న ప్రేమను బాహాటంగా బయటపెట్టింది విష్ణు ప్రియ.

Vishnu Priya Once again expressed her love on Akkineni Akhil
తనకు అక్కినేని అఖిల్ అంటే ప్రేమ అని పలు సందర్భాల్లో ఓపెన్ అయిన విష్ణు ప్రియ.. సోషల్ మీడియాలో అఖిల్ చేసే ప్రతి పోస్ట్‌కు రియాక్ట్ అవుతూ లవ్ సింబల్స్‌తో రచ్చ చేస్తుంటుంది. ఆమె చేసే కామెంట్లు బాగా వైరల్ కావడమే గాక అక్కినేని అభిమానుల చూపు తనపై పడేలా ఉంటాయి. అఖిల్ ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. అఖిల్ చేసుకోబోయే దేవత నేనే కావాలి అని గతంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది విష్ణు ప్రియ.
Vishnu Priya విష్ణు ప్రియ దసరా లవ్

Vishnu Priya Once again expressed her love on Akkineni Akhil
ఈ నేపథ్యంలోనే నేడు (అక్టోబర్ 15) అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ సందర్భంగా మరోసారి అలాంటి లవ్ ఎమోజీలతో తన ప్రేమను బయటపెట్టింది విష్ణు ప్రియ. థియేటర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సినిమా చూస్తూ అఖిల్ తెరపై కనిపించగానే ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ”దసరా లవ్” అని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.