Bigg Boss 5 Telugu : రాత్రి అందరికీ ఆ పని చేసి పెట్టిందట.. ప్రియాంక సింగ్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 7 September 2021, 3:28 pm

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో కేటగిరీలో ఓ కంటెస్టెంట్‌ను తీసుకుంటూ ఉంటారు. మూడో సీజన్‌లో తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఆమె చేసి వింత చేష్టలకు జనాలు తలపట్టుకున్నారు. దెబ్బకు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. అయితే ఈ ఐదో సీజన్‌లో ఓ ట్రాన్స్ జెండర్‌ను బిగ్ బాస్ టీం పట్టుకొచ్చింది. జబర్దస్త్ స్టేజ్ మీద సాయి తేజగా లేడీ గెటప్పుల్లో కనిపించింది. ఆ తరువాత లింగ మార్పిడి చేసుకుని ప్రియాంక సింగ్‌గా మారింది.

VJ sunny On Priyanka Singh In Bigg Boss 5 Telugu

VJ sunny On Priyanka Singh In Bigg Boss 5 Telugu

రాత్రి అందరికీ ఆ పని చేసి పెట్టిందట.. ప్రియాంక సింగ్ బిగ్ బాస్ 5 తెలుగు

తన గతాన్ని చెబుతూ స్టేజ్ మీద అందరినీ ఏడిపించేసింది ప్రియాంక సింగ్. తాను ఇలా మారిపోయానని ఇంకా తండ్రికి చెప్పనేలేదని, ఇంత మంది ముందు.. ఈస్టేజ్ మీద చెబుతున్నాను అని ఏడ్చేసింది. అలాంటి ప్రియాంక సింగ్ బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో తన దైన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తోంది. అతి మంచితనం అనే కేటగిరీలో ప్రియాంక సింగ్ పడేలా కనిపిస్తోంది. అయితే సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కొన్ని వింత ఘటనలు జరిగాయి. రాత్రి లోబో చేసిన పనికి ఎవ్వరికీ నిద్ర పట్టలేదు.

Bigg boss season 5 telugu day 1 in the house highlights

Bigg boss season 5 telugu day 1 in the house highlights

తన గురకతో అందరినీ విసిగించేశాడు లోబో. ఇదే విషయాన్ని ఉదయాన గార్డెన్ ఏరియాలో అందరూ చర్చించుకున్నారు. లోబో సైతం తన గురక విషయాన్ని తెలుసుకుని నవ్వాడు. ఇక ఇదే సమయంలో సన్నీ ఓ విషయాన్ని చెప్పాడు. పింకీ (ప్రియాంక సింగ్) రాత్రి అంతా కూడా హెడ్ మసాజ్ చేసిందని అన్నాడు. ఆమె ఓపికకు దండం పెట్టాలి.. తల నొప్పి పుడుతుందంటే… హెడ్ మసాజ్ చేస్తూ కూర్చుందని ప్రియాంక సింగ్ గురించి సన్నీ చెప్పేశాడు.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి