War 2 Movie : ఎన్టీఆర్ స్పీచ్‌తో “వార్ 2” హైప్ పీక్స్‌కి.. ఒక్క మాటతో సినిమాకి కొత్త ఊపు
ప్రధానాంశాలు:
War 2 Movie : ఎన్టీఆర్ స్పీచ్‌తో “వార్ 2” హైప్ పీక్స్‌కి.. ఒక్క మాటతో సినిమాకి కొత్త ఊపు
War 2 Movie : ఇప్పటివరకు వార్తలలో లేని ‘వార్ 2’ ఒక్క ఈవెంట్‌తోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్, సినిమా హైప్‌ని ఓ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈవెంట్‌కి హాజరైన ఎన్టీఆర్ తనదైన శైలిలో స్టేజ్ మీద ఊపు చూపించారు.”బొమ్మ అదిరిపోయింది!ష అని రెండు కాలర్లు ఎగురేసి పక్కా కాన్ఫిడెన్స్‌తో ప్రకటించడం ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది.

War 2 Movie : ఎన్టీఆర్ స్పీచ్‌తో “వార్ 2” హైప్ పీక్స్‌కి.. ఒక్క మాటతో సినిమాకి కొత్త ఊపు
War 2 Movie : ఊపు వచ్చేసింది..
ఎన్టీఆర్‌కు సినిమా ఫలితాలపై ఎంత స్పష్టత ఉంటుందో అందరికీ తెలుసు. ఫలితం అటూ ఇటూ అయితే ఎలాంటి ట్రోలింగ్ వస్తుందో ఆయనకు బాగా తెలుసు. అయినా, తాను చెబితే అది జరిగి తీరుతుందన్న విశ్వాసంతో, “సూపర్ హిట్ కొడుతున్నాం” అని చెప్పేయడం ఆయన ధైర్యాన్ని, సినిమాపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.
ఇంతవరకూ ‘వార్ 2’కి సంబంధించిన ప్రమోషన్‌లో ఒక్క మెయిన్ ఈవెంట్ కూడా జరగలేదు. కానీ ఈ ఒక్క ప్రీ-రిలీజ్ ఫంక్షన్, ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీచ్ తర్వాత… ఇక ఇంకే ఈవెంట్ అవసరం లేదన్న భావన ప్రేక్షకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఫ్యాన్స్ ఇప్పుడొకే మాట చెబుతున్నారు . “ఎన్టీఆర్ చెప్పాడంటే… అది జరగి తీరుతుంది! వార్ 2 ఈ నెల ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఎన్టీఆర్ స్పీచ్ సినిమాకు క్రేజీ మూమెంటమ్ తెచ్చిపెట్టింది అనడంలో సందేహమే లేదు.