Anchor Sowmya Rao : మాకొద్దు బాబోయ్ ఈ సౌమ్య రావు.. సోషల్‌ మీడియాలో వారి రచ్చ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Sowmya Rao : మాకొద్దు బాబోయ్ ఈ సౌమ్య రావు.. సోషల్‌ మీడియాలో వారి రచ్చ

 Authored By prabhas | The Telugu News | Updated on :11 December 2022,11:30 am

Anchor Sowmya Rao ; జబర్దస్త్ ప్రారంభం అయ్యి 10 సంవత్సరాలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ పది సంవత్సరాల్లో అనసూయ మరియు రష్మి గౌతమ్ మాత్రమే యాంకర్స్ గా వ్యవహరించారు. ఈ మధ్య అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో ఆమె స్థానం లో కన్నడ బ్యూటీ సౌమ్య రావు ని తీసుకు వచ్చారు. ఆమె యాంకరింగ్ కి మంచి మార్కులు పడుతున్నాయని అంతా భావించారు. కానీ ఒక వర్గం ప్రేక్షకులు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. వారే అనసూయ యొక్క అభిమానులు అంటూ ప్రచారం జరుగుతుంది. మళ్ళీ అనసూయను తీసుకు వచ్చే ఉద్దేశంతో సౌమ్య రావు

కి వ్యతిరేకంగా ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారట. సోషల్ మీడియా లో వారు చేసే హడావుడికి పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. మాకు వద్దు ఈ సౌమ్య అంటూ జబర్దస్త్ ప్రేక్షకులుగా చెప్పుకుంటున్న వారు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ అనసూయని తీసుకు రావాలి లేదంటే రష్మి గౌతమ్ అయినా కొనసాగాలి అంతే తప్పితే ఈ రావు మాకు వద్దు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ గతంలో ఒకసారి జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పి మళ్లీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే జబర్దస్త్ కి మళ్ళీ అనసూయ రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

we don't want Sowmya Rao as Jabardasth comedy show anchor

we don’t want Sowmya Rao as Jabardasth comedy show anchor

అందుకే సౌమ్య వెళ్లి పోవాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఈ విషయం ఎక్కడికక్కడ రచ్చ చేస్తుంది. ఒక వైపు సౌమ్య రావు యొక్క యాంకరింగ్ ప్రతిభ పై కూడా విమర్శలు వస్తున్నాయి. పదే పదే అర్ధం పర్ధం లేని తెలుగు మాట్లాడుతూ ఎలాంటి పేస్ ఫీలింగ్ లేని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుందని అందుకే ఆమెను తొలగించి అనసూయ లేదా కొత్త యాంకర్ ని తీసుకు రావాలంటూ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి మల్లెమాల వారు ఏం చేస్తారనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది