Samantha : “సుఖం” అంటూ నేరుగా నాగ చైతన్యకే కౌంటర్ వేసిందిగా.. సమంత మామూలుది కాదు వామ్మో..!
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుసు కదా. తన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా.. తన సినిమా కెరీర్ మాత్రం జోరుమీదుంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ యశోద. ఈ సినిమాకు హరి హరీశ్ డైరెక్టర్. ఆయన కొత్త దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే నెల 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమంత మెయిన్ పాత్రలో నటిస్తోంది. తనే ఈ సినిమాలో హీరో. ట్రైలర్ లోనూ సమంతనే హైలైట్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా సరోగసీ మీద ఆధారపడి తెరకెక్కింది.
ఈ సినిమా అందరు తల్లులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో సమంత ఒక సరోగసీ తల్లిగా నటిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో సమంతతో పాటు రావు రమేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ట్రైలర్ లో ఒక విషయాన్ని మాత్రం ఎక్కువగా వైరల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా సరోగసీ మదర్స్ మీద ఓ విషయాన్ని ఎందుకు వైరల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నొప్పి ఒకరిది సుఖం మరొకరిది అనే డైలాగ్ ను ఈ సినిమాలో సరోగసీ తల్లుల కోసమే పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసీ వివాదం రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే.

what is the meaning of samantha dialogue in yashoda trailer
Samantha : నొప్పి ఒకరిది.. సుఖం మరొకరిది అనే డైలాగ్ ఎవరి కోసం?
ఈ నేపథ్యంలో అదే కథతో సమంత యశోద సినిమా రావడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. అందులోనూ ఇన్ డైరెక్ట్ గా ఆ సినిమాలో కౌంటర్స్ ఉండటంతో అమ్మో.. ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలని అనుకుంటోంది అని అంతా భావిస్తున్నారు. మీరు ఎప్పుడైనా రెండు గుండెచప్పుళ్లు వినిపించాయా.. అంటూ సమంత తన కడుపులో మోస్తున్న బిడ్డ గురించి చెప్పడం ఇక్కడ మరో పాయింట్. ఏది ఏమైనా.. సమంత మాత్రం మరోసారి తన విశ్వరూపం చూపించింది. చూద్దాం మరి సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుందో.