Sundarakanda Second Heroine : సుందరకాండ మూవీలో సెకండ్ హీరోయిన్ ఎవరి మేనకొడలంటే..?
Sundarakanda Second Heroine : విక్టరీ వెంకటేశ్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన సక్సెస్.. ఆయన నటించిన సినిమాలు అన్ని వరుసగా హిట్ అవుతూ ఉండేవి.అందుకే ఆయనకు విక్టరీ అనేది ఒక ఇంటి పేరులా మారిపోయింది. వెంకటేశ్ విదేశాల్లో చదువుకుని వచ్చినా అచ్చమైనా పల్లెటూరి వ్యక్తిలా హావభావాలు పలికించే టాలెంట్ అతని సొంతం. వెంకటేశ్ తండ్రి డి రామానాయుడు టాలీవుడ్ లో ఎంత పెద్ద నిర్మాతో అందరికీ తెలిసిందే. ఆయన పేరుమీద ఏకంగా స్టూడియోనే ఉంది.
ఇక వెంకటేశ్ తీసిన సినిమాల విషయానికొస్తే సుందరకాండ చాలా పెద్ద హిట్. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేశ్ లెక్చరర్ పాత్ర పోషించారు. మొదట్లో వెంకటేశ్‌కు ఈ పాత్ర సెట్ అవ్వదని చాలా మంది అన్నారట.. కానీ సినిమా విడుదలయ్యాక ఆయన నటన చూసి అంతా ఫిదా అయిపోయారంటే అర్థం చేసుకోవచ్చు వెంకీ ఎంతబాగా యాక్ట్ చేశాడో..
Sundarakanda Second Heroine : అపర్ణ యాక్టింగ్‌కు డైరెక్షన్ టీం ఫిదా..
అసలు విషయానికొస్తే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ చేసిన నటి పేరు అపర్ణ. వెంకటేశ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేసింది. ఇందులో ఆమె లెక్చరర్ అయిన వెంకీని ప్రేమిస్తూ, అల్లరి చేసే పాత్ర..ఇందులో అపర్ణ అద్భుతంగా నటించింది. ఓ రోజు రాఘవేంద్ర రావు నిర్మాత కెవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లారట.. అక్కడే అపర్ణను చూసిన రాఘవేంద్ర రావు గారు తన స్టూడెంట్ క్యారెక్టర్‌కు ఈ అమ్మాయి సరిగ్గా సరిపోతుందని అనుకున్నారట..
కానీ ఈ విషయాన్ని ఆమెకు చెప్పి సినిమాకు ఒప్పించలేదు.కొన్నిరోజుల తర్వాత ఆ పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించగా అక్కడికి అపర్ణ వచ్చింది. అదే టైంలో దర్శకుడు ఆమె చూడగా.. ఆమె కెవీవీ సత్యనారాయణ గారి మేనకొడలు అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పగా.. వెంటనే ఆమెను ఒకే చేయాలని రాఘవేంద్ర రావు చెప్పారట.. నిజానికి ఆమెకు యాక్టింగ్ వచ్చా రాదా అని డైరెక్టింగ్ టీం చాలా కంగారు పడిందట. కానీ అనుకున్నదానికంటే అపర్ణ అద్భుతంగా నటించి ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 2002లో వివాహం చేసుకున్న అపర్ణ అమెరికాలో సెటిల్ అయ్యింది. ఆమె సెకండ్ ఇన్సింగ్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని టాక్.