Conductor Jhansi : పదేళ్లుగా రాని గుర్తింపు కండక్టర్‌ ఝాన్సీ కి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆమె స్పందన ఇదే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Conductor Jhansi : పదేళ్లుగా రాని గుర్తింపు కండక్టర్‌ ఝాన్సీ కి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆమె స్పందన ఇదే!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 October 2022,7:00 pm

Conductor Jhansi : కండక్టర్ ఝాన్సీ గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని బుల్లి తెర ప్రేక్షకులకు మరియు సోషల్ మీడియా జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఝాన్సీ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పల్సర్ బండి పాటకు డాన్స్ చేయడంతో అనూహ్యంగా పాపులారిటీని సొంతం చేస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ ఆమె గతంలో కూడా ఈటీవీలో కనిపించింది, అంతే కాకుండా పది సంవత్సరాల క్రితమే పలు ప్రముఖ ఛానల్స్ లో డాన్స్ కార్యక్రమాల్లో సందడి చేసింది. ఆ సమయంలో రాని గుర్తింపు.. పదేళ్లుగా డాన్స్ చేస్తున్నా కూడా రాని గుర్తింపు ఒక్క సారిగా ఇప్పుడు ఝాన్సీకి రావడం ఆమెకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కానిస్టేబుల్ కూతురైన ఝాన్సీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంది, కానీ ఆమె ఆర్థిక పరిస్థితి ఇతర విషయాలు సహకరించక పోవడంతో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తోంది.

ఒకవైపు డ్యూటీ చేస్తూనే మరో వైపు డాన్స్ షోలకు హాజరైంది. ఇన్నాళ్లు కండక్టర్ ఝాన్సీ అని కాకుండా డాన్సర్ ఝాన్సీ అంటూ అందరూ ఆమెను పిలిచేవారు. ఆ కారణంగానే ఇన్నాళ్లు ఆమెకు గుర్తింపు రాలేదట. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఈ స్థాయిలో తనకు గుర్తింపు రావడానికి కారణం తాను కండక్టర్ ని అని శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో చెప్పడమే. ఒక కండక్టర్ ఇలా డాన్స్ చేయడం ఏంటీ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది నా గురించి పోస్టులు పెట్టడం జరిగింది. అలా కండక్టర్ అనే పదం వల్ల నాకు పాపులారిటీ దక్కింది అంటూ ఝాన్సీ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నిజంగానే ఒక లేడీ కండక్టర్ డాన్స్ ఇంతగా ఇరగ దీయడం ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా ఆమె యొక్క పల్సర్ బండి డ్యాన్స్ ని చూశారు. ఆ తర్వాత ఆమె గతంలో చేసిన పాటలకు తెగ లైక్స్ కొట్టారు. అలా పల్సర్ బండి ఝాన్సీ..

conductor jhansi life story interesting updates

conductor jhansi life story interesting updates

డాన్సర్ ఝాన్సీ కాస్త కండక్టర్ ఝాన్సీగా మారి పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో ఈమెకి పాపులారిటీ దక్కింది అనడంలో సందేహం లేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ప్రతి చోట కూడా ఆమె గురించి జనాలు వెతుకుతూనే ఉన్నారు అంటే ఆమె క్రేజీ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు డ్యూటీ చేస్తూనే మరో వైపు డాన్స్ కార్యక్రమాలకు న్యాయం చేస్తున్న ఝాన్సీ ముందు ముందు సినిమాల్లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంపూర్ణేష్ బాబు తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశంను కండక్టర్ ఝాన్సీ కి ఇవ్వడం జరిగింది. సంపూర్ణేష్ బాబు సినిమా విడుదల కాకుండానే మరో సినిమాకి కూడా కండక్టర్ ఝాన్సీ సైన్‌ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఝాన్సీ కాస్త కండక్టర్ ఝాన్సీ అవ్వడం వల్ల ఈ పది ఏళ్లలో దక్కని గుర్తింపు ఇప్పుడు దక్కింది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది