Immanuel – Nookaraju : ఇమాన్యూల్‌, నూకరాజ్ ఎందుకు టీమ్ లీడర్స్ కాలేక పోతున్నారో తెలుసా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Immanuel – Nookaraju : ఇమాన్యూల్‌, నూకరాజ్ ఎందుకు టీమ్ లీడర్స్ కాలేక పోతున్నారో తెలుసా!

 Authored By prabhas | The Telugu News | Updated on :14 October 2022,10:30 am

Immanuel – Nookaraju : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ ఎంతగా చేరువయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారిని కూడా అలరిస్తున్న జబర్దస్త్ కామెడీ షో తో ఎంతో మంది కమెడియన్స్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. వారిలో ఇమాన్యుల్ మరియు నూకరాజులు కూడా ఉన్నారు అనడంలో సందేహం లేదు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో ముఖ్యమైన కమెడియన్స్ గా ఉన్నారు ఉండడంలో సందేహం లేదు. వీరిద్దరూ కలిసి చేసే కామెడీ అంతా అంతా కాదు. ఇమాన్యుల్ మరియు నూకరాజు ఇద్దరు కలిసి కామెడీ చేస్తే ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతూ ఉంటారు. వీరిద్దరూ కూడా తమకు ఉన్న లోపాలను ఎత్తి చూపుకుంటూ తమను తామే తగ్గించుకుంటూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు.

నూక రాజుకు షుగర్ వ్యాధి ఉంది, దానిని ఆయనే బయటికి చెప్పుకొని దాని ద్వారా కామెడీ పండించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇమాన్యుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ఇంతగా గుర్తింపు దక్కించుకున్నారు కానీ జబర్దస్త్ టీం లీడర్స్ గా మాత్రం అవ్వలేక పోతున్నారు. గతంలో ఇలా వచ్చి అలా టీం లీడర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పటికి కొంత మంది టీమ్‌ లీడర్స్ గా కొనసాగుతున్నారు. కామెడీతో నవ్వించలేక పోయినా కూడా వారు టీం లీడర్స్ గా ఉంటున్నారు, కానీ ఎంతో కామెడీ చేస్తూ నవ్వించి కార్యక్రమానికి హైలైట్ గా నిలిచే వీరిద్దరికి మాత్రం టీం లీడర్ పోస్ట్ రాకపోవడం వెనక ఏదైనా కారణం ఉందా అంటూ వారి యొక్క అభిమానులు చర్చించుకుంటున్నారు.

Why Immanuel and Nookaraju are not able to become team leaders

Why Immanuel and Nookaraju are not able to become team leaders

అసలు విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్తగా టీమ్స్ చేసే ఆలోచనను మల్లెమాల వారు చేయడం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో షో కి చాలాగా తక్కువగా రేటింగ్ నమోదు అవుతుంది. ఇలాంటి సమయంలో ఉన్న టీమ్స్ లోనే కొన్నింటిని తగ్గించారు. గతంలో గంటకు పైగా కార్యక్రమం టెలికాస్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు 40 నుండి 45 నిమిషాలు మాత్రమే కార్యక్రమం ఉంటుంది. టీం లీడర్లకు రెమ్యూనరేషన్ తగ్గించడంతో పాటు చాలా విషయాల్లో మల్లెమాల కాస్ట్ కట్టింగ్ చేస్తోంది. అందుకే వీరిద్దరికీ టీం లీడర్ గా అవకాశం రావడం లేదని.. జబర్దస్త్ ప్రారంభమైన మూడు నాలుగు సంవత్సరాల సమయంలో అయితే వీరిద్దరికి వెంటనే టీం లీడర్ పదవి వచ్చేది అంటూ జబర్దస్త్ ని మొదటి నుండి పరిశీలిస్తున్న కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది