Pushpa 2 Movie : పుష్ప 2 సినిమా విషయంలో ఇంత పెద్ద రిస్క్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒప్పుకోరేమో..?
Pushpa 2 Movie : కొన్నిసార్లు మన స్టార్ హీరోల కోసం డైరెక్టర్స్ చేసే కొన్ని రిస్కులు వల్ల అభిమానులు కూడా డిసప్పాయింట్ అవుతుంటారు. దాంతో వారు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడి లెక్కలు మారిపోయి మళ్ళీ హిట్ కొట్టాలంటే చాలా ఏళ్ళు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఉదాహరణ మెగాస్టార్ నటించిన స్టాలిన్, పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి లాంటి సినిమాలే. ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ కూడా ఓ పెద్ద రిస్క్ చేస్తున్నాడట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా పుష్ప. సుకుమార్‌కు దర్శకుడిగా, నిర్మాతలకు, హీరోయిన్ రష్మికకు ఈ సినిమా ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమానే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఇది ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఎవరూ ఊహించని విధంగా 350 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి, పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వసూళ్ళను చూసి బాలీవుడ్ వారు కూడా షాకయ్యారు. డబ్బింగ్ వర్షన్ అయినా, ఎలాంటి ప్రొమోషన్స్ లేకుండానే 100 కోట్ల మార్క్ టచ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా వసూళ్ళతో ఇప్పుడు పుష్ప సీక్వెల్ సినిమా పుష్ప 2పై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు సుకుమార్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం మేకోవర్ పరంగా ప్రిపరేషన్ లో ఉన్నాడు.

Will Allu Arjun Fans Admit That Such Big Risk In Pushpa 2 Movie
Allu Arjun : ఇంకో హీరోని ఊహించుకోవడం అంటే..?
అయితే, గతకొన్ని రోజుల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా పుష్ప 2 లో బన్నీ 55 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నాడట. తన కొడుకు పాత్రలో మరొక యంగ్ హీరో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ లేకుండా పుష్ప రాజ్ క్యారెక్టర్ ని ఊహించడం, బన్వర్ సింగ్ షికావత్ ఎదురుగా అల్లు అర్జున్ కాకుండా ఇంకో హీరోని ఊహించుకోవడం అంటే అసలు అభిమానులకు మింగుడుపడుతుందా. సుకుమార్, పుష్ప 2 విషయంలో బన్నీ యంగర్ వర్షన్ కోసం మరో హీరోని పెట్టి రాంగ్ స్టెప్ వేయబోతున్నాడా..? అని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ సుక్కూ ఎప్పుడిస్తారో చూడాలి.