Guppedantha Manasu : రాజీవ్ అసలు స్వరూపం తెలుసుకున్న చక్రపాణి.. రాజీవ్ కు షాక్ ఇచ్చి రిషితో వసుధార పెళ్లి జరిపిస్తాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu : రాజీవ్ అసలు స్వరూపం తెలుసుకున్న చక్రపాణి.. రాజీవ్ కు షాక్ ఇచ్చి రిషితో వసుధార పెళ్లి జరిపిస్తాడా?

Guppedantha Manasu : అసలు వసుధార ఇలా ఎందుకు చేస్తోంది. వసుధార లేకుండా నేను ఎలా బతకగలను. అసలు రిషిధారను ఎవ్వరూ విడదీయలేరు. ఎలాగైనా వసుధారను దక్కించుకుంటా అని దాబాలో ఉన్న రిషి అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు ఆసుపత్రిలో చక్రపాణి, సుమిత్ర ఇద్దరూ చికిత్స పొందుతూ ఉంటారు. సుమిత్రను పొడిచిన రాజీవ్… దాన్ని వసుధార మీదికి నెట్టడంతో వసుధారను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ లో కూర్చొని మంగళసూత్రాన్ని చూస్తూ వసుధార […]

 Authored By gatla | The Telugu News | Updated on :8 January 2023,9:00 am

Guppedantha Manasu : అసలు వసుధార ఇలా ఎందుకు చేస్తోంది. వసుధార లేకుండా నేను ఎలా బతకగలను. అసలు రిషిధారను ఎవ్వరూ విడదీయలేరు. ఎలాగైనా వసుధారను దక్కించుకుంటా అని దాబాలో ఉన్న రిషి అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు ఆసుపత్రిలో చక్రపాణి, సుమిత్ర ఇద్దరూ చికిత్స పొందుతూ ఉంటారు. సుమిత్రను పొడిచిన రాజీవ్… దాన్ని వసుధార మీదికి నెట్టడంతో వసుధారను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ లో కూర్చొని మంగళసూత్రాన్ని చూస్తూ వసుధార ఏడ్చేస్తుంది. ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చిన రాజీవ్.. సుమిత్ర బతికి ఉండకూడదని అనుకుంటాడు. తన గురించి అన్నీ తెలిసిన అత్తయ్య కోలుకున్నాక అవన్నీ మామయ్యకు చెబితే ఎలా అని అనుకుంటాడు. దీంతో తన ఆక్సీజన్ మాస్క్ ను తీసేస్తాడు. చక్రపాణి స్పృహలో ఉండడు.

will chakrapani realize about goodness of rishi

will chakrapani realize about goodness of rishi

ఆక్సీజన్ మాస్క్ తీసేయడంతో సుమిత్ర గిలగిలా కొట్టుకుంటుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఆక్సీజన్ మాస్క్ తీసేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజీవ్. అతడు వెళ్లిపోగానే కళ్లు తెరుస్తాడు చక్రపాణి. రాజీవ్ మాటలు అన్నీ విని.. రాజీవ్ అసలు స్వరూపం తెలుసుకుంటాడు చక్రపాణి. సుమిత్ర అని పిలుస్తాడు. లేచి తనను కాపాడుదామంటే లేవలేకపోతాడు చక్రపాణి. ఇంతలో ఆసుపత్రికి వచ్చిన రిషి… సుమిత్ర గిలగిలా కొట్టుకోవడం చూస్తాడు. వెంటనే లోపలికి వెళ్లి ఆక్సిజన్ మాస్క్ తనకు పెడతాడు. దీంతో సుమిత్ర ప్రాణాల నుంచి బయటపడుతుంది. అదంతా చక్రపాణి చూస్తూనే ఉంటాడు. వెంటనే డాక్టర్ ను పిలుచుకొస్తాడు రిషి. డాక్టర్ గారు పేషెంట్ మాస్క్ ఊడిపోయింది అని చెబుతాడు. దాంతో పేషెంట్ వెళ్లి చెక్ చేస్తాడు. ఆక్సీజన్ మాస్క్ పెట్టలేదేంటి అని డాక్టర్ ను అడుగుతాడు. ఎంత ఖర్చయినా పర్వాలేదు. మంచి ట్రీట్ మెంట్ ఇవ్వండి. వీళ్లకు నేనున్నాను అంటాడు రిషి.

రిషి సార్ వజ్రం లాంటి వారు.. మంచి మనసు ఉన్న వారు అని వసుధార చెప్పిన మాటలు చక్రపాణికి గుర్తొస్తాయి. ఇంతలో రాజీవ్ అక్కడికి వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని రిషిని అంటాడు. దీంతో వీళ్లను చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంది కదా అంటాడు.

నీకు వసుధార అమ్మానాన్నలు కానీ.. నాకు అత్తామామలు. అయినా ఇదంతా నీ కారణంగానే. నీ వల్లే వసు.. తన తల్లిని పొడిచి ఆసుపత్రికి వెళ్లింది అంటాడు రాజీవ్. దీంతో ఇద్దరూ గొడవ పడటం చూస్తాడు చక్రపాణి. నువ్వు ఇక్కడే ఉంటే మామయ్య గారు కళ్లు తెరిచి చూస్తే ఈసారి గుండె ఆగి చచ్చిపోతారు అంటాడు రాజీవ్.

Guppedantha Manasu : రిషిని ఆసుపత్రి నుంచి వెళ్లగొట్టిన రాజీవ్

అసలు నీవల్లే ఇదంతా జరిగింది అంటాడు రాజీవ్. ఎందుకు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నావు. జరిగిన దాని గురించి వదిలేయ్.. అంటాడు రిషి. ఇతడిని ముందు బయటికి పంపించేయండి అని డాక్టర్ తో అంటాడు రాజీవ్. దీంతో మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అంటాడు డాక్టర్.

మీరు వెళ్తారా? లేక సెక్యూరిటీని పిలవాలా అంటాడు డాక్టర్. మా మామయ్య గారు, అత్తయ్య గారు బతకాలంటే ఇతడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు అంటాడు రాజీవ్. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు జగతి, మహీంద్రా.

వసుధారే జీవితం అనుకున్నాడు. కానీ.. ఇప్పుడు రిషి మళ్లీ ఒంటరి వాడు అవుతాడు జగతి అంటాడు మహీంద్రా. రిషి గెలుస్తాడు మహీంద్రా అంటుంది జగతి. ఒకవేళ రిషి ఇంటికి వెళ్లి ఉంటాడేమో అంటాడు మహీంద్రా. మనం కూడా ఇంటికి వెళ్దాం పదా అంటాడు మహీంద్రా.

మరోవైపు ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన రిషి.. ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఎన్ని కబుర్లు చెప్పావు. కొత్త జీవితాన్ని చూపించి.. ఇప్పుడేమో వెళ్లిపో అంటున్నావు అని అనుకుంటాడు రిషి. మరోవైపు ఇంటికి వెళ్లి అక్కడికి రిషి వచ్చాడేమో అని వెతుకుతారు. కానీ.. రిషి రాలేదు అని మహీంద్రా, జగతికి చెబుతుంది ధరణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది