Janaki Kalaganaledu : జానకి, రామాను గుడిసెలో నుంచి బయటికి పంపించేందుకు మల్లిక సూపర్ ప్లాన్? జ్ఞానాంబ ఒప్పుకుంటుందా?
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 25 మార్చి 2022, ఎపిసోడ్ 265 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎందుకు గుడిసె వేసుకొని ఉంటున్నారు అని రామా, జానకిని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. దీంతో ఇది నాయినమ్మ నాకు రాసిచ్చిన జాగ. ఇక్కడ నాకు ఉండే హక్కు ఉంది అని అంటాడు రామా. దీంతో జ్ఞానాంబకు కోపం ఎక్కువవుతుంది. నువ్వు నా అని అంటున్నావంటే.. నువ్వు అలా మాట్లాడటం వెనుక ఎవరు ఉన్నారో నాకు అర్థం అవుతోంది అంటుంది జ్ఞానాంబ.
దీంతో అత్తయ్య గారు నేను మీ కుటుంబంతో బంధాన్ని.. మీతో అనుబంధాన్ని తెంచుకొని ఎలా వెళ్లగలం అత్తయ్య గారు. ఏం చేయాలో తెలియక.. ఇక్కడ ఇలా ఉండిపోయాం అంటుంది జానకి. దీంతో ఇదంతా నీ నాటకం అని నాకు తెలుసు. నా కొడుకు ఎంత అమాయకుడో కూడా నాకు తెలుసు. నా కొడుకును నువ్వు ఎంతలా గుప్పిట్లో పెట్టుకున్నావో దీన్ని బట్టే నాకు అర్థం అవుతోంది అంటుంది జ్ఞానాంబ.
ఇన్నాళ్లను నువ్వేంటో.. నీలో ఉన్న అసలు మనిషి ఏంటో నేను ఇప్పటికి తెలుసుకున్నాను. చూడు.. ఏ ఉద్దేశంతో నువ్వు ఇక్కడ మకాం పెట్టించావో నాకు తెలుసు. కానీ.. మీ ఆటలు, మీ ఉద్దేశాలు ఏవీ నా దగ్గర సాగవు. జ్ఞానాంబ ఇక్కడ అది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు పడుకోవడం కోసం జానకి, రామా ఇద్దరూ కలిస మంచ అల్లుకుంటారు. ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద వంట వండుతుంది జానకి. తను అలా అవస్థలు పడుతూ వండటం చూసి బాధపడతాడు రామా. మంచి చేయాలని చూసి.. అందరి ముందు అవమాన పడ్డారు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు అని అనుకుంటాడు రామా.
నేను ఓడిపోయానండి. నన్ను క్షమించండి జానకి గారు అని మనసులో అనుకుంటాడు రామా. మీరు ప్రతిక్షణం నా గురించే ఆలోచిస్తున్నారని నాకు అర్థం అయింది. మిమ్మల్ని ఈ బాధనుంచి ఎలా బయట పడేయాలో నాకు అర్థం కావడం లేదు అనుకుంటుంది జానకి.
ఉప్మా వండుతుండగా తనకు చేయి కాలుతుంది. ఆ విషయం రామా గమనిస్తాడు. అమ్మ కళ్ల ముందే ఉండాలనేది నా ఆశ. అందుకే నేను మీకు ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి జానకి గారు అంటాడు రామా. అయ్యో రామచంద్ర గారు.. మీరు కూడా మీ అమ్మ గారి ముందు ఉండాలన్నదే నా ఆశ.. అంటుంది జానకి.
Janaki Kalaganaledu : జానకికి ఉప్మా తినిపించిన రామా
కట్టెల పొయ్యి మీద కొత్త కాబట్టి కాస్త కష్టంగా అనిపించింది. రేపటి నుంచి డైరెక్ట్ గా చేతులతోనే తీసుకొస్తాను అంటుంది జానకి. మీకోసమే నేను జీడిపప్పు ఉప్మా చేశాను. తినండి అంటుంది జానకి. దీంతో రామా.. ఉప్మాను తింటాడు. చాలా బాగుంది అంటాడు.
తనకు కూడా తినిపిస్తాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా ఆ గుడిసెలో గడుపుతారు. కట్ చేస్తే ఈరోజు నుంచి ఆ స్వీట్ కొట్టును నువ్వే చూసుకోవాలి అని అఖిల్ కు చెబుతుంది జ్ఞానాంబ. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. రామా, జానకి కూడా షాక్ అవుతారు.
జానకి.. జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి అఖిల్ పై చదువులు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెబుతుంది. దయచేసి అఖిల్ చదువు మాన్పించకండి అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అంటుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.