Karthika Deepam : మౌనితపై అనుమానంతో మండిపడుతున్న కార్తీక్… సంతోషంలో తేలిపోతున్న దీప… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam : మౌనితపై అనుమానంతో మండిపడుతున్న కార్తీక్… సంతోషంలో తేలిపోతున్న దీప…

 Authored By saidulu | The Telugu News | Updated on :2 October 2022,10:00 am

Karthika Deepam : బుల్లితెరపి ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 1473 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దుర్గ, మౌనితా దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావ్ బంగారం అని అడుగుతాడు. అప్పుడు మౌనిత.. బంగారం ఏంట్రా బంగారం.. ఎక్కువ చేస్తున్నావ్ నువ్వు ఎంత త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అంత బాగుంటుంది. అని తనపై చేయి లేపుతుండగా.. ఆ చేతిని దుర్గ పట్టుకుని రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సీన్ ని కార్తీక్ చూసి అనుమానం పడుతూ ఉంటాడు. ఇక దుర్గా కార్తీక్ వైపు చూసి అయ్యో ఏం లేదు సార్ మౌనిత కోపం ఇంకా పోలేదు దానికి చేతిని పట్టుకొని కోపం తగ్గాలని కూల్ చేస్తున్న అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత కుడా కార్తీక్ కి నిజం చెప్పడం కోసం ట్రై చేస్తూ ఉండగా.. కార్తీక్ శివ ఎక్కడ అని అడుగుతాడు.

అప్పుడు మౌనితా బయటికి వెళ్ళాడు. అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ వాడిని కూడా బయటికి పంపించావా అని అనుమానంగా మాట్లాడుతూ… దీప దగ్గరికి వెళ్లి కూర్చుని నా మనసు ఏం బాగాలేదు.. వంటలక్క అని అంటాడు. అప్పుడు ఏమైంది. డాక్టర్ బాబు నాకు ఏ విషయమైనా చెప్పండి నేనేమీ అనుకోను అని అంటుంది. అప్పుడు నువ్వేమీ అనుకో మాకు అని తనకి జరిగిందంతా చెప్పబోతూ ఉండగా… శివ అక్కడికి వచ్చి సార్ మీరు నన్ను అడిగారంట కదా… అని అనగానే కార్తీక్ అప్పుడు ఏదో అడిగాను లే ఇప్పుడు ఏమి అవసరం లేదు.. వెళ్ళు అని అంటాడు. అప్పుడు శివ, సార్ మీరు కూడా రండి మేడం మిమ్మల్ని ఒక రెండు గంటలు అలా బయట తిప్పి తీసుకొని రండి అలాగే సినిమాకి కూడా వెళ్ళండి అని చెప్పారు. అని శివ అంటూ ఉంటాడు. అప్పుడు నన్ను ఎందుకు బయటికి వెళ్ళమని చెప్తుంది. అసలేం జరుగుతుంది. నాకేం అర్థం కావట్లేదు అని ఒక్కసారిగా కార్తీక్ కోపంగా కూర్చున్న చైర్ ని తంతాడు. అప్పుడు దీప ఆవేశ పడకండి డాక్టర్ బాబు అని కార్తీక్ ని కూల్ చేస్తూ ఉంటుంది. అసలు మౌనిత ఇలా ఎందుకు చేస్తుంది.

karthik tells deepa about monita

Will Karthika Deepam karthik tells deepa about monita

అసలు దుర్గాకి మౌనితాకి ఎటువంటి సంబంధం ఉంది. మౌనిత ఎందుకు కంగారుపడుతుంది. అని దీపని అడుగుతూ ఉంటాడు. మీరేం చూశారు మీరు ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు. డాక్టర్ బాబు ఏం జరిగింది నాకు చెప్పండి అని అంటుంది.అప్పుడు కార్తీక్ మౌనితా దుర్గకి ఒక సంవత్సరం పాటు తనకి వంట చేసి పెట్టిందట. అంటే వీళ్లిద్దరూ కలిసే ఉన్నారా.. మళ్ళీ నా ముందే తన చెయ్యి పట్టుకుని రొమాంటిక్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను మేనేజ్ చేశాను. నువ్వు కూడా మేనేజ్ చెయ్ అని చెప్తున్నాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది. అసలు అంతకుముందు ఏం సంబంధం ఉంది. అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు దీప సంతోషంతో లోపల పొంగిపోతూ… దుర్గ మోనితకు కొన్నాళ్లుగా తెలుసట వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట. అని నాకు దుర్గా చెప్పాడు కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారట అని కొన్ని లేనిపోనివన్నీ మౌనిత పై చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆవేశంగా మౌనిత దగ్గరికి వెళ్లి అసలు ఏం జరుగుతుంది. మౌనితా నన్ను ఎందుకు బయటికి వెళ్ళమని చెప్పావ్ నువ్వేం చేయాలనుకుంటున్నావ్.. అంటూ తనపై అనుమానంతో కోప్పడుతూ ఉంటాడు.. అప్పుడు దుర్గ ఏంటి సార్ ఏమైంది అని డ్రామాలాడుతూ ఇంకా మౌనితా పై అనుమానం వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు.. ఇక కార్తీక్ రోజురోజుకి మోనిత పై అనుమానం పెరుగుతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement
WhatsApp Group Join Now

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది