Intinti Gruhalakshmi : సామ్రాట్ తన భార్య గురించి అసలు నిజం చెబుతాడా? తన భార్య ఏమైందో తులసికి చెబుతాడా?
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 26 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 747 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసితో తప్పు చేయించి.. సామ్రాట్ ముందు దోషిగా నిలబెట్టిస్తే మేనేజర్ పోస్ట్ నీకే వస్తుంది. తులసికి ఎలాగూ చదువు రాదు కాబట్టి దాన్నే మనం అవకాశంగా తీసుకోవాలి అని చెబుతుంది. మరోవైపు అభితో ప్రేమ్, శృతి, అంకిత మాట్లాడుతారు. జనరల్ మేనేజర్ గా పనిచేసే అవకాశం అమ్మకు లభించింది. తనకు ఇష్టం లేకపోయినా ప్రెజర్ కు తలవంచి నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. అమ్మను ప్రశాంతంగా పనిచేసుకోనిద్దాం అంటాడు ప్రేమ్.
దీంతో నేను ఎలా కనిపిస్తున్నాను మీకు. రోజూ మామ్ తో యుద్ధం చేసేవాడిలా కనిపిస్తున్నానా? మామ్ మీద, మామ్ ప్రేమ మీద మీకే కాదు.. నాకు కూడా ప్రేమ ఉంది. నాకు ఆస్తి రాకుండా చేసిందని మామ్ మీద కోపం ఉంది. అంతమాత్రం చేత మామ్ మీద నాకు ధ్వేషం లేదు అంటాడు అభి. మనం భయపడ్డామంటే ఆంటిని అవమానించడమే అవుతుంది.. అంటుంది అంకిత. మామ్ విషయంలో ఇంత ఆరాటపడుతున్నారు. మరి డాడ్ విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు. మనం మాత్రం ఇతరులను సమానంగా చూడాలి అంటాడు అభి.
కట్ చేస్తే హనీ, లక్కీకి భోజనం తినిపిస్తూ ఉంటుంది తులసి. దీంతో మాకు కూడా తినిపించు అని అందరూ వచ్చి అక్కడ నిలబడతారు. దీంతో అందరికీ ముద్ద కలిపి పెడుతుంది తులసి. దీంతో అందరూ కలిసి భోజనం చేస్తుండటం చూసి సామ్రాట్ కు ముచ్చటేస్తుంది.
Intinti Gruhalakshmi : ప్రెస్ మీట్ లో మరో ప్లాన్ వేసిన లాస్య
మరోవైపు నందును ప్రెస్ మీట్ అరేంజ్ చేయమని అంటాడు సామ్రాట్. అంతకంటే ముందు తులసి మెసేజ్ ను ప్రెస్ కు రిలీజ్ చేసింది ఎవరు.. తులసి ఇవ్వని ఇంటర్వ్యూను పేపర్ లో వచ్చేలా చేసిందెవరు అనేది మీరు ఎంక్వయిరీ చేయాలి అని అడుగుతాడు పరందామయ్య.
దీంతో వద్దు అని అంటుంది తులసి. తప్పు చేసింది ఎవరో తెలుసుకొని ఏం చేస్తారు అని అడుగుతుంది. నాకు అపకారం చేసిన వాళ్లు కూడా బాగుండాలని అనుకుంటాను. అదే నేను చేసేది.. అంటుంది తులసి.
సరే అంటాడు సామ్రాట్. ఈ పోలీస్ ఎంక్వయిరీలు మనకు వద్దు బాబాయి అంటాడు సామ్రాట్. కానీ.. ప్రెస్ మీట్ అవసరం అంటాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది తులసి. మరోవైపు ప్రెస్ మీట్ కోసం అందరూ రెడీ అవుతుంటారు.
ఇంతలో ప్రెస్ మీట్ కు వచ్చిన మీడియా వాళ్లకు ఏదో చెబుతుంది లాస్య. ఈ ప్రశ్నలు అడగండి అని మరో ప్లాన్ చేస్తుంది లాస్య. మరోవైపు అభిని కూడా సామ్రాట్ మీదికి రెచ్చగొడుతుంది లాస్య. దీంతో అభి.. సామ్రాట్ ను నిలదీస్తాడు.
మా మామ్ ఇక నుంచి మీతో కలిసి పనిచేయదు అంటాడు అభి. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. తన భార్య గురించి నిజం చెప్పమనండి అంటాడు అభి. లేచిపోయిందా? వదిలేశారా? చంపేశారా? చెప్పండి అని అడుగుతాడు అభి. దీంతో సోఫా మీద కూలబడిపోతాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.