Intinti Gruhalakshmi : పరందామయ్య తిరిగి అనసూయ దగ్గరికి వెళ్తాడా? తులసిపై నందు ఎందుకు సీరియస్ అవుతాడు?
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 28 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 800 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయను తీసుకొని తులసి.. ఇంట్లోకి రాబోతుండగా ఆపుతాడు నందు. నాన్న ఈ ఇంట్లో అడుగుపెట్టేంత వరకు నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టకూడదు అంటాడు నందు. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. నీకు ఇక్కడ ఏం […]
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 28 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 800 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయను తీసుకొని తులసి.. ఇంట్లోకి రాబోతుండగా ఆపుతాడు నందు. నాన్న ఈ ఇంట్లో అడుగుపెట్టేంత వరకు నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టకూడదు అంటాడు నందు. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. నీకు ఇక్కడ ఏం పని. గెట్ అవుట్ అంటాడు నందు. దీంతో నన్ను తీసుకొచ్చింది అంటుంది అనసూయ. దీంతో కోపంగా చూస్తాడు నందు. మాజీ కోడలు, అత్త మళ్లీ జట్టు కట్టారా? సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటుంది లాస్య.
తను ఈ ఇంటి మనిషి కాదమ్మా.. పరాయి మనిషి అంటాడు నందు. తనను అడగాల్సినవి కానీ. తన నుంచి తెలుసుకోవాల్సినవి కానీ ఏం లేవు. కానీ నిన్ను అడగాల్సినవి చాలా ఉన్నాయి అంటాడు నందు. మా నాన్న ఎక్కడ. ఎందుకు ఇంటికి రాలేదు అని ప్రశ్నిస్తాడు నందు. నిన్నే అడిగేది అంటాడు నందు. దీంతో అనసూయకు ఏం చేయాలో అర్థం కాదు. అత్తయ్య మామయ్యను బతిమిలాడి నచ్చజెప్పి ఇక్కడికి తీసుకురావడానికే వెళ్లివస్తున్నారు. కానీ.. ఆయన రావడానికి ఒప్పుకోలేదు అంటుంది తులసి. దీంతో ఎలా వస్తారు. సిగ్గుతో తల భూమిలోకి దించుకునేలా తన వాళ్లే ప్రవర్తిస్తే ఎలా వస్తారు అంటాడు నందు.
ఎలా వస్తారనుకున్నావమ్మా ఆత్మాభిమానం ఉండదా? మానాన్నను ఈ విధంగా వేరే ఎవరైనా అనుమానించి ఉంటే.. మా నాన్న మీద ఒట్టేసి చెబుతున్నాను. ఈపాటికి అవమానించిన మనిషిని చంపేసి ఉండేవాడిని అంటాడు నందు.
Intinti Gruhalakshmi : తులసి గురించి టెన్షన్ పడ్డ సామ్రాట్
కానీ.. ఆ మనిషి నాకు జన్మనిచ్చిన అమ్మ అయిపోయింది అంటాడు నందు. నీ బొడ్డు తెంచుకొని పుట్టాను. నీ పాలు తాగి పెరిగాను. కానీ.. మా నాన్న పెంచిన పద్ధతి, సంస్కారం నన్ను ఆపాయి. మా నాన్న ఈ ఇంటి గుమ్మం లాంటి వారు. నీ తల ఎంత ఎత్తులో ఉన్నా.. గుమ్మం దగ్గర తల దించుకొని రావాల్సిందే.
అలా చేయకపోగా లోకం ముందు నాన్న పరువు తీశావు. నాన్న గౌరవం నిలబెట్టడానికి ప్రాణం ఇవ్వగలను.. ప్రాణం తీయగలను. కానీ.. ఇక్కడ మా నాన్న పరువు గంగలో కలిసేలా చేసింది మా అమ్మ.
అందుకే నేనే నా ప్రాణం ఇస్తాను.. నా ప్రాణం తీసుకుంటాను అంటాడు నందు. నేను చావడానికైనా సిద్ధమే కానీ.. నాన్న లేకుండా ఉండలేను అంటాడు నందు. మరోవైపు పరందామయ్య గురించి టెన్షన్ పడుతూ ఉంటారు సామ్రాట్, బాబాయి.
ఇప్పటి వరకు తులసి గారు రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ పడుతుంటారు. మామయ్యను అవమానించి అత్తయ్య తప్పు చేశారు. మీరు అత్తయ్యను అవమానించి మళ్లీ అదే తప్పు చేయకండి అని నందుతో అంటుంది తులసి.
తను చిన్నప్పటి నుంచి మీరు చేసిన తప్పులను సరిచేస్తూ ఎదిగేలా చేసింది అంటుంది. దీంతో మా అమ్మ చేసినంత పెద్ద తప్పు నేనెప్పుడూ చేయలేదు. అస్సలు చేయలేదు అంటాడు నందు.
మరోవైపు తులసిని బ్లేమ్ చేయడం కోసం తన మీదికి టాపిక్ ను మళ్లిస్తుంది లాస్య. అసలు ఈ గొడవ అంతా మామయ్య బర్త్ డే రోజు ఎందుకు జరిగింది. అంతా నువ్వే చేశావు అంటుంది లాస్య.
మరోవైపు మా నాన్న ఇంటికి తిరిగి వచ్చే వరకు నీకు కొడుకున్నాడన్న విషయం మరిచిపో అంటాడు నందు. ఇంకొక మాట మా నాన్నను నువ్వు ఇంటికి తిరిగి తీసుకురానంత వరకు ఈ ఇంట్లో కాలు పెట్టడానికి వీలు లేదు అని డోర్ మూస్తాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.