Janaki Kalaganaledu : రామాకు 5 లక్షలు ఇస్తారా? కన్నబాబు అప్పు తీర్చుతాడా? ఇంతలో కన్నబాబు ప్లాన్ ఏంటి? 5 లక్షలను కాజేస్తాడా?
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 20 జూన్ 2022, ఎపిసోడ్ 326 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామాకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇస్తాడు చెఫ్ సంజయ్. ఒకవేళ 5 నిమిషాల్లో అతడికి హెల్ప్ చేసేవాళ్లు రాకపోతే అతడిని ఫైనల్ పోటీల నుంచి ఎలిమినేటర్ చేయడం జరుగుతుంది అని అంటాడు చెఫ్. ఇంతలో జ్ఞానాంబ ఉన్న రూమ్ […]
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 20 జూన్ 2022, ఎపిసోడ్ 326 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామాకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇస్తాడు చెఫ్ సంజయ్. ఒకవేళ 5 నిమిషాల్లో అతడికి హెల్ప్ చేసేవాళ్లు రాకపోతే అతడిని ఫైనల్ పోటీల నుంచి ఎలిమినేటర్ చేయడం జరుగుతుంది అని అంటాడు చెఫ్. ఇంతలో జ్ఞానాంబ ఉన్న రూమ్ ను రూమ్ బాయ్ లాక్ చేస్తాడు. ఇదంతా కన్నబాబు ప్లాన్. దీంతో జ్ఞానాంబ బయటికి రాలేకపోతుంది. ఎంత డోర్ కొట్టినా ఎవ్వరూ రారు.. డోర్ తీయరు. మరోవైపు తనకు ఇచ్చిన 5 నిమిషాల గడువు అయిపోవడంతో తనను ఫైనల్ పోటీల నుంచి తప్పిస్తున్నట్టుగా చెఫ్ సంజయ్ చెబుతాడు.
దీంతో ఎలాగైనా ఫైనల్స్ పోటీ చేయాలని అనుకుంటాడు రామా. నాకు ఎవ్వరి సాయం లేకున్నా పర్వాలేదు. నేను ఒక్కడినే పోటీలో పాల్గొంటా అని అంటాడు రామా. కానీ.. నీ చేయి బాగోలేదు కదా.. ఎలా చేస్తావు అని అడుగుతాడు చెఫ్. దీంతో నేను ఈ ఫైనల్ పోటీల్లో పాల్గొంటాను అంటాడు రామా. నేనిక్కడికి గెలవడానికి వచ్చాను.. మధ్యలో వదిలేసి వెళ్లిపోవడానికి కాదు అని అంటాడు రామా. నేను చివరి వరకు పోరాడుతాను కానీ.. భయపడి వెనకడుగు వేయను అని చెప్పి పూతరేకులు తయారు చేయడం ప్రారంభిస్తాడు రామా.
Janaki Kalaganaledu : ఫైనల్ లో గెలిచిన రామా
టైమ్ స్టార్ట్ కాగానే.. రామా పూతరేకులు తయారు చేయడం ప్రారంభిస్తాడు. ముగ్గురు ఫైనలిస్టులు తమ వంటను చేయడం ప్రారంభిస్తారు. మరోవైపు ఓ రూమ్ బాయ్.. జ్ఞానాంబ డోర్ కొట్టడం చూసి లాక్ ఓపెన్ చేస్తాడు. దీంతో పరుగు పరుగున జ్ఞానాంబ అక్కడికి వస్తుంది.
ఇంతలో పోటీ పూర్తవుతుంది. రామా తయారు చేసిన పూతరేకులను జడ్జిలు టేస్ట్ చేస్తారు. బాగుంది అని అనుకుంటారు. ఫైనలిస్టులు ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. చివరగా ఇద్దరు మిగులుతారు. అందులో రామా, రోహిత్ ఇద్దరూ ఉంటారు.
ఈ ఇద్దరిలో ఫైనల్ గా గెలిచింది రామచంద్ర అని చీఫ్ గెస్ట్ ప్రభ చెబుతుంది. రామాను పైకి రావాలని చెబుతారు. రామా పైకి వెళ్తాడు. తనకు 5 లక్షలు చెక్, కప్ ఇవ్వబోతుండగా.. నాకు ఈ అవార్డును మా అమ్మ చేతుల మీదుగా తీసుకోవాలని ఉంది అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.