Janaki Kalaganaledu : జ్ఞానాంబ సాయం లేకున్నా ఫైనల్స్ లో గెలిచిన రామా.. ఇంతలో రామాకు మరో షాక్.. 5 లక్షలు రామాకు ఇస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : జ్ఞానాంబ సాయం లేకున్నా ఫైనల్స్ లో గెలిచిన రామా.. ఇంతలో రామాకు మరో షాక్.. 5 లక్షలు రామాకు ఇస్తారా?

 Authored By gatla | The Telugu News | Updated on :18 June 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 20 జూన్ 2022, ఎపిసోడ్ 326 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు కానీ.. జ్ఞానాంబ రాదు. తన డోర్ లాక్ వేసి ఉండటంతో జ్ఞానాంబ రాలేకపోతుంది. దీంతో చెఫ్ సంజయ్ ఇచ్చిన 5 నిమిషాల సమయం ముగిసిపోతుంది. దీంతో రామాను ఫైనల్స్ నుంచి తప్పిస్తున్నట్టు చెబుతాడు చెఫ్ సంజయ్. దీంతో తను కనుక ఈ ఫైనల్స్ లో పాల్గొనకపోతే.. స్వీట్ షాపునకు డబ్బులు కట్టకపోతే కష్టం అనుకొని.. ఎలాగైనా నేను ఒక్కడినే ఈ పోటీల్లో పాల్గొంటా అంటాడు రామా. మీ చేయి బాగోలేదు అని చెప్పినా రామా వినడు.

will rama win in finals round in janaki kalaganaledu

will rama win in finals round in janaki kalaganaledu

చివరకు ఎలాగోలా కష్టపడి.. తన చేతికట్టును కూడా తీసేసి పూతరేకులు తయారు చేస్తాడు. అందరూ రామా ఎలా పూతరేకులు తయారు చేస్తాడని చూస్తారు. చివరకు రామా ఇచ్చిన సమయంలోపు పూతరేకులు తయారు చేస్తాడు. దాన్ని టేస్ట్ చేసిన జడ్జిలు సూపర్బ్ అంటారు. ఉన్న ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. చివరగా రామా, ఇంకో వ్యక్తి ఉంటారు. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్ గా అనౌన్స్ చేయబోతారు. విన్నర్ ను ముఖ్య అతిథి ప్రభ అనౌన్స్ చేస్తారని చెబుతాడు సంజయ్.

Janaki Kalaganaledu : విన్నర్ ఎవరో చెప్పిన ప్రభ

ప్రభ వచ్చి విన్నర్ మరెవరో కాదు.. రామచంద్ర అని చెబుతుంది. తనకు గాయం అయినా.. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం వెనుదిరగకుండా పోటీల్లో పాల్గొని చెఫ్ విజేతగా నిలిచాడని ప్రభ తనను పొగుడుతారు. ఇంతలో హౌస్ కీపింగ్ వ్యక్తి జ్ఞానాంబ డోర్ కొట్టడాన్ని చూసి తన డోర్ తీస్తాడు.

దీంతో పరిగెత్తుకుంటూ తను అక్కడికి వస్తుంది. తన కొడుకే విన్నర్ అయ్యాడని తెలుసుకొని సంతోషిస్తుంది. విన్నర్ ను స్టేజ్ మీదికి పిలుస్తారు. కానీ.. ఈ అవార్డును తాను తన అమ్మ చేతుల మీదుగా తీసుకుంటానని చెబుతాడు. రామా గెలవడంతో సునంద, కన్నబాబుకు కోపం వస్తుంది. ఏం చేయాలో వాళ్లకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది