Karthika Deepam : జ్వాల ఎవరో అసలు నిజం సౌందర్యకు శోభ చెప్పేస్తుందా? సౌందర్య.. శోభను నమ్ముతుందా? హిమ ఏం చేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam : జ్వాల ఎవరో అసలు నిజం సౌందర్యకు శోభ చెప్పేస్తుందా? సౌందర్య.. శోభను నమ్ముతుందా? హిమ ఏం చేస్తుంది?

 Authored By gatla | The Telugu News | Updated on :19 June 2022,10:30 am

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 20 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 1383 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరుపమ్, హిమ పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. హిమ ఎంత తప్పించుకోవాలనుకున్నా అస్సలు కుదరదు. దీంతో పసుపు దంచుడు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. హిమ టెన్షన్ పడటాన్ని గమనించి నువ్వేం ఆలోచించకు హిమ అని అనుకుంటాడు నిరుపమ్. ఇవాళ కార్తీక్, దీపల పెళ్లి రోజు అని చెబుతుంది సౌందర్య. నిరుపమ్, హిమ ఇద్దరినీ రెడీ చేస్తారు. ముందు సౌందర్య, స్వప్న ఇద్దరూ పసుపు దంచుతారు. ఆ తర్వాత నిరుపమ్, హిమ ఇద్దరూ పసుపు దంచుతారు. వీళ్లిద్దరినీ ఇలా చూడటం నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది శోభ. తనను చూసి కారు వెనుక దాక్కుంటుంది. వామ్మో.. ఇది కనుక లోపలికి వెళ్లిందంటే రచ్చ రచ్చే. దీన్ని గుర్తు పడితే అందరూ ఒక్కటవుతారు. హిమ కోసం దీన్ని పెళ్లి చేసినా చేస్తారు అని అనుకుంటుంది శోభ.

will shobha reveals the truth to soundarya about jwala

will shobha reveals the truth to soundarya about jwala

దీంతో వెంటనే హిమ ఫోన్ చేసినట్టుగా జ్వాలకు ఫోన్ చేస్తుంది. నేను నీ ఆటోలోనే ఉన్నా రా అంటుంది. తన ఆటో దగ్గరికి రాబోయే సరికి.. ఆటోను వేసుకొని ముందుకు వెళ్తుంది. తన ఆటో వెనుక పరిగెత్తినా కూడా తనకు ఆటో దొరకదు. తర్వాత కొంత దూరం ఆటోను తీసుకెళ్లి అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శోభ. దీంతో నిరుపమ్ ఇంటి లోపలికి వెళ్లలేకపోతుంది జ్వాల. మరోవైపు నిరుపమ్, హిమ పసుపు దంపుడు కార్యక్రమం పూర్తవుతుంది.

Karthika Deepam : డాక్టర్ సాబ్ ను కలవడానికి ఆసుపత్రికి వచ్చిన జ్వాల

మరోవైపు హాస్పిటల్ కు వస్తుంది సౌందర్య. హిమ దగ్గరికి వస్తుంది. దీంతో నేను నీకోసం రాలేదు.. నా మనవడి కోసం వచ్చాను అంటుంది సౌందర్య. నా మనవడే ఒక మంచి ముహూర్తం చూడమన్నాడు అంటుంది సౌందర్య. వద్దు నానమ్మ.. నేను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాను.

ఎందుకు ఇదంతా.. అవసరమా. బావ జీవితం ఎటూకాకుండా పోతుంది అని చెబుతుంది హిమ. కానీ.. సౌందర్య మాత్రం అస్సలు వినదు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపు నానమ్మ అంటుంది హిమ. కానీ.. నిరుపమ్ నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అంటుంది సౌందర్య.

ఇంతలో నిరుపమ్ వస్తాడు. నువ్వు ఏ ముహూర్తం ఫిక్స్ చేస్తే అదే టైమ్ కు మా పెళ్లి అంటాడు నిరుపమ్. దీంతో ముందు మీరు మీరు తేల్చుకోండి అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య. ఇంతలో జ్వాల హాస్పిటల్ కు వెళ్తుంది. నువ్వెందుకు ఇంటికి రాలేదు అని అడుగుతాడు నిరుపమ్.

ఏంటి జ్వాలా నువ్వు ఈ ఫోన్ కాల్స్ గొడవ ఏంటి అని అడుగుతాడు నిరుపమ్. దీంతో తన శత్రువు ఫోన్ చేసిందని అంటుంది జ్వాల. రా.. నీతో చాలా మాట్లాడాలి.. నీతో తేల్చుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అని జ్వాలను తీసుకెళ్లబోతుండగా నేను కూడా వస్తా అని అంటుంది హిమ.

నువ్వెందుకు తింగరి అని అంటుంది జ్వాల. కట్ చేస్తే ఎంత వెతికినా కనిపించని నీ ముద్దుల మనవరాలు నాకు కనిపించింది అని శోభ.. సౌందర్యతో చెబుతుంది. దీంతో ఎక్కడ కనిపించింది చెప్పు శోభ అని అడుగుతుంది సౌందర్య. దీంతో నాకు ఏమిస్తారు అని అడుగుతుంది శోభ. దీంతో చెప్పు శోభ నీకు ఏం కావాలి చెప్పు అని బతిమిలాడుతుంది సౌందర్య. నిరుపమ్ ను నాకిచ్చి పెళ్లి చేయండి అంటుంది శోభ. నీ మనవడు నా మెడలో తాళి కట్టగానే.. నీ మనవరాలు నీ ఇంట్లో ఉంటుంది అని చెబుతుంది శోభ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది