Gangavva : వామ్మో.. నిజంగా యూట్యూబర్ గంగవ్వ నెలకు అంత సంపాదిస్తుందా ?
Gangavva : తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె యూట్యూబ్ లో ఒక సంచలనం అనడంలో సందేహం లేదు. మై విలేజ్ షో ( my village show )ద్వారా శ్రీకాంత్ ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆమె నటిస్తున్నట్లుగా కాకుండా జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆమెకు నటన అంటే తెలియదు, శ్రీకాంత్ ఏదైతే చెప్తాడో అదే ఆమె చేసి చూపిస్తుంది. నిజ జీవితంలో ఎలా అయితే ఉంటుందో అలాగే వీడియోలో కూడా […]
Gangavva : తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె యూట్యూబ్ లో ఒక సంచలనం అనడంలో సందేహం లేదు. మై విలేజ్ షో ( my village show )ద్వారా శ్రీకాంత్ ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆమె నటిస్తున్నట్లుగా కాకుండా జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆమెకు నటన అంటే తెలియదు, శ్రీకాంత్ ఏదైతే చెప్తాడో అదే ఆమె చేసి చూపిస్తుంది. నిజ జీవితంలో ఎలా అయితే ఉంటుందో అలాగే వీడియోలో కూడా కనిపించడం వల్ల గంగవ్వ కి మంచి ఆదరణ లభించింది. ఆ ఆదరణ కారణంగానే బిగ్ బాస్ (bigg boss ) లో కూడా ఆమెకు చోటు దక్కింది. కానీ పల్లెటూరికి చెందిన గంగవ్వ అది కూడా కాస్త వయసు ఎక్కువ ఉన్న గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది.
ఎవరికి కూడా దక్కని వెసులుబాటు ఆమెకు దక్కి చాలా త్వరగానే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ తో వచ్చిన రెమ్యూనరేషన్ ని ఉపయోగించుకొని ఒక ఇల్లు నిర్మించుకున్న గంగవ్వ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలతో రెగ్యులర్గా ప్రేక్షకులకు చేరువగా ఉంటుంది. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ తో పాటు తన సొంత యూట్యూబ్ ఛానల్ ని కూడా ఏర్పాటు చేసుకున్న గంగవ్వ ప్రస్తుతం నెలకు బాగానే సంపాదిస్తుందట. ఒకప్పుడు కూలీ పనులు చేసుకుని బతికిన గంగవ్వ ఇప్పుడు నెలకు అటు ఇటుగా లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. కేవలం యూట్యూబ్ వీడియోలు కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా గంగవ్వ కనిపిస్తున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు చేస్తున్న గంగవ్వ భవిష్యత్తులో పెద్ద సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ మధ్య చిరంజీవి నటించిన ఒక సినిమాలో గంగవ్వ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గంగవ్వ ఒక్క రోజు సినిమాలో నటిస్తే పది వేల రూపాయల పారితోషికం అందుకుంటుందట. శ్రీకాంత్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు షూటింగ్ సెట్ కు వచ్చి గంగవ్వతో దర్శకుడు చెప్పినట్లుగా చేయిస్తారట. కనుక వారికి కొంత మొత్తంలో డబ్బు అందుతుంది. మొత్తానికి గంగవ్వ ఈ వయసులో సెలబ్రిటీ అయి సంపాదిస్తున్నారు అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గంగవ్వ సంపాదిస్తుంది.. ఆమె సెలబ్రిటీ అయింది.. మేమెందుకు కాకూడదు, మేము ఎందుకు ట్రై చేయకూడదు అంటూ ఎంతో మంది యూట్యూబ్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ప్రయత్నిస్తున్నారు.