vishnu : వైఎస్ జగన్ నాకు బావ.. కేటీఆర్ చాలా క్లోజ్.. దయచేసి మీరు ఇందులో ఇన్‌వాల్ అవ్వద్దు : మంచు విష్ణు
vishnu మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఉత్కంఠకు తెర అక్టోబర్ 10 తర్వాత వీడనుంది. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి అధ్యక్ష పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ప్రకటించగా, మంచు విష్ణు కూడా తన ప్యానెల్ సభ్యులను మీడియాకు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్యానెల్ నుంచి డిఫరెంట్ పొలిటికల్ పార్టీల వారు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు.

Ys jagan And ktr very close Manchu vishnu
రాజకీయ పార్టీలు తలదూర్చొద్దు.. vishnu
ఏపీ సీఎం జగన్ తనకు బావ అవుతాడని, తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని మంచు విష్ణు చెప్పాడు. మా ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అన్నాడు. అన్ని పార్టీల వారు తన ప్యానెల్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది కేవలం చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశమని చెప్పాడు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి పలువురు తన ప్యానెల్‌లో పలు పదవులకు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు.
బాబుమోహన్ బీజేపీలో ఉన్నారని, పృథ్వీరాజ్ వైసీపీలో ఉన్నారని, నటుడు మాదాల రవి వామపక్ష పార్టీలకు తెలుగు రాష్ట్రాల్లో క్యాంపెయినర్‌గా ఉన్నారని, ఇలా తన ప్యానెల్‌లో విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన నటులు ఉన్నారని విష్ణు చెప్పాడు. ఇకపోతే తాను మా అధ్యక్షుడిగా పోటీ చేసే విషయం తనకు తానుగా తీసుకున్నదని, ఇండస్ట్రీ నుంచి కొంత మంది పెద్దలు చెప్పడంతో తాను పోటీకి దిగానని పేర్కొన్నాడు. తన తండ్రి మోహన్ బాబు ఎవరిని అడగలేదని ఈ సందర్భంగా మీడియాకు తెలిపాడు. నటుడు బండ్ల గణేశ్ ఇండిపెండెంట్‌గా జనరల్ సెక్రెటరీ పదవి కోసం పోటీ చేస్తున్నారు.