RRR Movie : ఆర్ఆర్ఆర్ ఫిల్మ్‌పై ఉన్న ఆశలు అడియాసలు చేసిన జగన్ సర్కారు..?
RRR Movie : ఎంటర్ టైన్మెంట్ ఇంటస్ట్రీ కరోనా మహమ్మారి వల్ల తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంది. కొవిడ్ వల్ల చాలా కాలం పాటు సినిమా షూటింగ్స్ ఆగిపోగా, పెద్ద సినిమాల బడ్జెట్ పెరిగిపోయి ఇబ్బందులెదురయ్యాయి. కాగా, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్నది. పెద్ద సినిమాలు విడుదలై సక్సెస్ అవుతున్నాయి. థియేటర్స్‌కు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే బాట పడుతున్నారు. ఓటీటీలను పక్కనెట్టి మళ్లీ వినోదం కోసం టాకీసులకు వస్తున్నారు.ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ చూసేందుకుగాను తప్పకుండా థియేటర్స్‌కు ప్రేక్షకులు వస్తారని మూవీ ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నారు.
ఈ సంగతులు అలా ఉంచితే.. ఏపీ ప్రభుత్వం థియేటర్స్‌లో టికెట్స్ ప్రైసెస్ తక్కువ చేసిన విషయం, బెన్ ఫిట్ షోస్‌కు అనుమతించకపోవడం వంటి విషయాలు సినీ వర్గాలకు నచ్చడం లేదు. ఈ క్రమంలోనే ఈ విషయాలపై ఏపీ సర్కారుతో చర్చించేందుకు ప్రయత్నిస్తామని ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రొడ్యూసర్ దానయ్య తెలిపారు.థియేటర్స్‌లో టికెట్ల ధర తగ్గించడం వల్ల పెద్ద సినిమాలకు నష్టమేనని, ఈ విషయమై ఏపీ ప్రభుత్వంతో మరోసారి సంప్రదిస్తామని ప్రొడ్యూసర్స్ దానయ్య, కల్యాణ్ అన్నారు.అయితే, ఏపీలో జగన్ సర్కారు ఉన్నంత వరకూ సినిమా టికెట్ల ధరలు పెరగబోవని, బెన్‌ఫిట్ షోస్ ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యనించారు.
RRR Movie : గడ్డు పరిస్థితుల నుంచి బయటపడుతున్న క్రమంలో మరో దెబ్బ.. !
ఈ వ్యాఖ్యలతో ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆశలు అడియాసలు అయినట్లుగానే కనబడుతున్నది. సినీ పెద్దలు మరోసారి జగన్ సర్కారుతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఈ విషయాలపై సానుకూలంగా స్పందించే సిచ్యువేషన్స్ అయితే కనబడటం లేదు. ఇప్పటికే విడుదలైన ‘అఖండ’ చిత్రంలో బెన్‌ఫిట్ షో వేసిన థియేటర్ యాజమాన్యంపైన ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యల ద్వారా సినిమా పరిశ్రమకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సినీ పెద్దలు కొందరు పేర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వ చర్యలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ పైన ప్రభావం పడనుందని మరి కొందరు అంటున్నారు.