Chandrababu : కుప్పంలో ఓటమి గ్యారెంటీ అని చంద్రబాబుకి అర్ధమైంది.. అందుకే ఇలా?
Chandrababu: వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలవడం అనేది పక్కన పెడితే అసలు తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా.. అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి కుప్పం అనేది చంద్రబాబుకు అచ్చొచ్చిన నియోజకవర్గం. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ విజయదుందుబి మోగించింది.
దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయాలా.. వద్దా అనే మీమాంసలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం.. అసలు చంద్రబాబు పోటీ చేస్తే ఒకవేళ గెలవకపోతే.. ఇంకేమైనా ఉందా. ఇప్పటికే తన కొడుకు లోకేశ్ బాబు మంగళగిరిలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఆ విషయం అందరికీ తెలుసు. మరోసారి మంగళగిరిలో పోటీ చేస్తే కూడా ఓడిపోయే పరిస్థితులే అక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు నారా లోకేశ్ ఎక్కడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు. అందుకే చంద్రబాబుకు పార్టీ గెలుపు కన్నా కూడా తన ఓటమి చంద్రబాబును ఎక్కువగా బాధిస్తోందట.
Chandrababu : ఇంత సడెన్ గా మళ్లీ కుప్పం పర్యటన ఎందుకు?
నిజానికి చంద్రబాబు ఆ మధ్య కుప్పం మొహమే చూడలేదు. కానీ.. ఈ మధ్య కుప్పానికి గత కొంత కాలంగా వెళ్తున్నారు. కనీసం నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వెళ్లి వస్తున్నారు. తన సొంత నియోజకవర్గం కావడంతో క్యాడర్ ను ఉత్సాహపరచడానికి చంద్రబాబు అప్పుడప్పుడు వెళ్తున్నారు. మళ్లీ ఈనెల 14 నుంచి 16 వరకు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులతో సమావేశం కానున్నారు. తాజాగా ఆయన కుప్పంలో ఇంటిని కూడా నిర్మించుకున్నారు. అంటే.. రాబోయే రోజుల్లో కుప్పంపై చంద్రబాబు మరింత ఫోకస్ పెంచనున్నారని తెలుస్తోంది.